యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ హ్యాట్రిక్ హిట్ కి ప్లాన్ చేస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఇచ్చిన ఈ క్లాస్ డైరెక్టర్ ముచ్చటగా మూడో సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇద్దరు హీరోలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన హీరోతో పాటు ప్రజెంట్ యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న మరో హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.


యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ రెండు సినిమాలతోనే మంచి స్టఫ్ ఉన్న డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. నాని హీరోగా నటించిన నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ మొదటి సినిమాతోనే మెప్పించాడు. ఇక ఈ ఏడాది నాగచైతన్య, సమంతల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా మజిలీతో ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రెండు సక్సెస్ లు ఇచ్చిన శివ నిర్వాణ ప్రస్తుతం ఓ ఇద్దరు యంగ్ హీరోలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. 


దర్శకుడు శివ నిర్వాణ మజిలీ షూటింగ్ సమయంలోనే విజయ్ దేవరకొండ కు ఓ స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు వినిపిస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడనే టాక్ వినిపిస్తోంది. అదే విధంగా నాని కోసం కూడా శివ నిర్వాణ మరో కథను సిద్దం చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాని వీ సినిమాతో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ పైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఇద్దరి హీరోలతో  దర్శకత్వం వహిస్తున్న ఈ  యంగ్ డైరెక్టర్ తర్వాత ఏ హీరోతో ముందు సినిమా చేస్తాడనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి యంగ్ డైరెక్టర్ శివనిర్వాణ హ్యాట్రిక్ సినిమాకు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరు క్రేజీ హీరోలపై ఫోకస్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ఇద్దరు హీరోలతో సక్సెస్ లు అందుకునేందుకు చూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: