ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలలో నటన ఉంటుంది అని ప్రేక్షకుడు ఆశించి వెళ్లితే బోల్తా పడ్డట్లే. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు పక్కా కమర్షియల్ వ్యాపారంగా, ఇదే కాకుండా చేసుకున్నంత వారికి చేసుకున్నంత ఎంజాయ్ చేసే అడ్డాగా మారిపోయిందంటున్నారు. దాదాపుగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో అడల్ట్ కంటెంట్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి.

 

 

ఇందులో నటించే హీరోయిన్స్ కూడా తమ విలువలను పక్కన పెట్టి బ్లూ ఫిలింస్‌కు ఏ మాత్రం తక్కువ కాకుండా దేహ సౌందర్యాలను ఆరబోస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం పోస్టర్, టీజర్స్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నారన్నారు. అశ్లీలత ఎక్కువ ఉండేలా పోస్టర్ విడుదల చేయడం ప్రమోషన్ ట్రిక్స్‌గా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జీవితా రాజశేఖర్..

 

 

ఇదిలా ఉండగా నిన్న ఏడు చేపల కథ, నేడు డిగ్రీ కాలేజ్ సినిమా టైటిల్ ఏదైనా కంటెంట్ మాత్రం ఒక్కటే. బోల్డ్ సీన్లతో టీజర్లు వదిలి తమ సినిమా అలాంటిదే అని చెప్పకనే చెప్పేసి, స్టార్లు లేకపోయినా ఓపెనింగ్స్ ఇలా తెచ్చుకోవచ్చు. అనే కమర్షియల్ సూత్రం ఈ రోజు తెలుగు సినిమాలో ట్రెండ్‌గా మారింది. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా డిగ్రీ కాలేజ్ కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సినిమా టీజర్ లోని బోల్డ్ సన్నివేశాలు మహిళలను కించపరిచేలాగా ఉన్నాయని ఇప్పటికే జీవితా రాజశేఖర్ విమర్శించారు.

 

 

అయితే దీనిపై దర్శకుడు నరసింహా నంది స్పందిస్తూ, తన సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుందని, దమ్ముంటే రిలీజ్ కాకుండా అడ్డుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు తన సినిమాను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని, సినిమా చూడకుండా కామెంట్స్ చేయవద్దని దర్శకుడు నరసింహ నంది ఈ సందర్భంగా హెచ్చరించాడు. ఇక ఇలాంటి వాఖ్యల వల్ల సినిమాకు పబ్లిసిటీ పెరుగుతుందని ఇలా చేస్తున్నారంటూ కొందరు సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: