రకుల్ ప్రీత్ సింగ్ కు విషయం అర్థమైంది. మేటర్ లేని చోట ఎంత ఆరాటపడినా అనవసరమని తెలుసుకున్నట్టుంది. అందుకే సైడ్ బిజినెస్ లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది రకుల్. కొత్తకొత్త బిజినెస్ లు మొదలుపెడుతోంది. 

 

రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ అనే పదం చాలా కాలమైంది. తెలుగు, తమిళ్, హిందీ అన్నిచోట్ల ట్రై చేసినా రకుల్ కి ఫ్లాపులే ఎదురవుతున్నాయి. దీనికి తోడు రకుల్ లుక్ లోనూ చాలా మార్పులొచ్చాయి. మన్మథుడు 2 అయితే రకుల్ కంటే నాగార్జున చాలా యంగ్ గా కనిపించాడని కామెంట్స్ వచ్చాయి. 

 

రకుల్ చాలా ఓల్డ్ గా కనిపిస్తుందనే కామెంట్స్ తో ఈమెని హీరోలంతా పక్కనపెట్టేస్తున్నారు. యంగ్ స్టర్స్ అయితే రకుల్ ని కూడా చూడట్లేదు. ఓ వైపు ఫ్లాపులు, మరోవైపు మూసుకుపోతున్న దారులతో రకుల్ కి కష్టాలు మొదలయ్యాయి. దీంతో కొత్తకొత్త  ఆదాయ మార్గాలు వెతుక్కుంటోంది రకుల్. సినిమాలతో పాటు బిజినెస్ లపైనా ఫోకస్ పెడుతోంది. 

 

రకుల్ ఆల్ రెడీ ఎఫ్ 45 జిమ్ లతో ఫిట్ నెస్ బిజినెస్ చేస్తోంది. అలాగే ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో పైన్ కాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ టీమ్ తీసుకొని స్పోర్ట్స్ బిజినెస్ లోనూ అడుగుపెట్టింది. ఇప్పుడు కొత్తగా పుడ్ బిజినెస్ లోకి దిగుతానంటోంది రకుల్. దీంతో సినిమాలతో పెట్టుకుంటే అయ్యేపని కాదనీ.. లైఫ్ సెట్ చేసుకోవడానికి రకుల్ బిజినెస్ లపై ఫోకస్ పెడుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు సినిమాలతో పాటు.. మరోవైపు సైడ్ బిజినెస్ లకు ఆసక్తి చూపిస్తుండటంతో ఆమె లైఫ్ సెటిల్ చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫిట్ నెస్ సెంటర్ లు పెట్టి ఎంతో మందిని ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దుతోంది.  తీరిక దొరికినప్పుడల్లా కస్టమర్స్ తో టైమ్స్ స్పెండ్ చేస్తోంది. తన సలహాలను వారితో పంచుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: