సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె. నాయుడు అంటే ఆయన గురించి అన్నీ రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇక ఈయన సెట్ లో చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన డెడికేషన్ కి దర్శకులు ఫిదా అవుతుంటారు. ఇండస్ట్రీలో ఈ సీనియర్ పనితనాన్ని మెచ్చని హీరోనే ఉండరు. నిర్మాతలకు ఎంతో ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె. నాయుడు అని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. సెట్స్ లో తను అందరితో ఎంతో జోవియల్ గా ఉంటారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని నిర్మాతలు చెబుతారు. ఛోటా. కె ఎనర్జీ చూసి హీరోయిన్లు కూడా షాకవుతుంటారు. ఆ మధ్య ఓ మీడియా సమావేశంలోనే కాజల్ అగర్వాల్ ను బుగ్గపై ముద్దు పెట్టి ఎంత సంచలనం అయ్యాడో తెలిసిందే. అయితే స్నేహంతో ఎగ్జయిట్ అయ్యి ఆ మూవ్ మెంట్ లో అలా జరిగిపోయిందని తర్వాత క్లారిటి ఇచ్చారు. 

 

ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో కాజల్ తనకు తానుగానే ఛోటా.కె తో స్నేహం గురించి చెప్పుకొచ్చింది. ఛోటా కే  తన హీరోయిన్స్ తో ఎంతో సరదాగా.. చనువుగా ఉంటారని చెప్పిన కాజల్ ఆయనలో మరో యాంగిల్ కూడా ఉందని తెలిపారు. సెట్ లో ఆయన చెప్పినట్లు వినకపోతే ఎవరిపైన అయినా సీరియస్ అవుతాడని చెప్పింది. ఆ లక్షణం ముందునుంచి ఛోటాకు ఉందట. సీనియర్.. జూనియర్ అనే తేడా లేకుండా ఆర్టిస్టు తను చెప్పిన టైమ్ కి రాకపోతే సీరియస్ అవుతారట. 

 

ఒకప్పుడు రామానాయుడు స్టూడియోలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుందట. ఆ సినిమా హీరోయిన్ పై ఉదయం 5 గంటలకు సీన్స్ ని షూట్ చేయాల్సి ఉంది. అందుకు ఛోటాకె చాలా ముందుగా ప్రిపేరయ్యారు. తన అసిస్టెంట్ల బృందంతో చాలా ముందుగానే లొకేషన్ కి చేరుకుని అంతా సిద్ధం చేసి పెట్టాడుట. కానీ హీరోయిన్ ధీమాగా సెట్ కి 6.30కి వచ్చింది. దీంతో కోపగించుకున్న ఆయన ఆ హీరోయిన్ కి షూటింగ్ క్యాన్సిల్ చేశామని.. తర్వాతి రోజు రావాలని చెప్పాడట. ఆ సమయంలో ఎగ్జిక్యుటివ్ నిర్మాత సముదాయించినా వినలేదట. 

 

ఆ విషయం తెలిసీ నిర్మాత కూడా ఛోటా.కె కే సపోర్ట్ చేశారట. అయితే తనకు సపరేట్ హోటల్ బుక్ చేయడం వల్లనే ఇంత పెద్ద రాద్దాతం జరిగిందని హీరోయిన్ నేరుగా ఛోటా.కెకి సారీ చెప్పి ఖరీదైన పెర్ ప్యూమ్ కొనిచ్చిందట. ఇలాంటి సంఘటనే ఛోటా పని చేసిన మొదటి సినిమా 'అమ్మ రాజీనామా' విషయంలోనూ ఆర్ట్ డైరెక్టర్ తను చెప్పినట్లు చేయకపోవడం వల్ల కోపం కట్టలు తెచ్చుకోవడంతో పెద్ద రచ్చే జరిగిందట. ఈ విషయాన్ని ఛోటా నే స్వయంగా తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: