ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజపుత్ తన బోల్డ్ క్యారెక్టర్ తో పెద్ద దుమారమే లేపింది. నటించింది ఒకే ఒక్క సినిమాలో అయ్యినప్పటికీ... టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూడని రియలిస్టిక్ క్యారెక్టర్ లో సూపర్ గా జీవించి అందరి నోళ్లతో.. 'వావ్ ' అనిపించింది. ఈ సినిమా తర్వాత సేమ్ అలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఆఫర్స్ యే పదుల సంఖ్యలో ఆమె కాళ్ళ ముందుకు వచ్చాయి. దాంతో పాయల్ రాజపుత్ 'ఆర్డీఎక్స్ లవ్' చిత్రాన్ని ఎంచుకొని.. మళ్లి ఇంకొక బోల్డ్ క్యారెక్టర్ లో నటించి కుర్రకారికి తన సెక్సీ బాడీ... ఇంకా సూపర్ హాట్ ఎక్సప్రెషన్స్ తో పిచ్చెకించింది. సో, ఈమె నటించిన రెండు సినిమాలు కూడా అలాగే ఉండటంతో వాటికే పరిమితం చేసారు దర్శక, నిర్మాతలు.

ప్రస్తుతం పాయల్ రాజపుత్.. రవి తేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే... ఇటీవల ఒక కొత్త దర్శకుడు... పాయల్ దగ్గరకు ఒక కథ పట్టుకొని వచ్చాడంట.. సరే మంచి కథ అయితే చేద్దాంలే అని కథ చెప్పమంటే.. నెరేషన్ మొదలుపెట్టిన అరగంటలోనే 5 బెడ్రూమ్ సన్నివేశాలు..ఇంకా లిప్ లాక్ సీన్లు చెప్పాడంట. దాంతో.. 'అబ్బే.. ! ఆ పెదవులు కొరకడాలు.. బెడ్ రూమ్ లో సెక్సీ ముఖకవళికలు ఇవ్వడాలు.. నావల్ల కాదండీ' అంటూ ఈ సినీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట ఈ ముద్దుగుమ్మ.

'ఆర్డీఎక్స్ లవ్' చిత్రంలో నటించడానికి ఒప్పుకునే తప్పుచేసానండి... ఆ దర్శకుడు కూడా బోల్డ్ సబ్జెక్ట్ అని చెప్పి.. చివరికి దాన్ని బూతు సినిమాను చేసారని చెప్తూ బాధ పడుతుంది పాయల్. అందుకే.. ఇప్పట్లో బోల్డ్ కంటెంట్ జోలికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదట్లో గుర్తింపు కోసం అలాంటి క్యారెక్టర్లు చేసిన.. తరువాతానైన మంచి పాత్రలు చేసి మంచి గుర్తింపు పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి! అంటూ...పాయల్ కూడా ఇప్పుడు ఇలాంటి గుర్తింపే కోరుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: