బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని, నేహ ధూపియా, మనీషా కోయిరాల, సంజయ్ కపూర్, రాధిక ఆప్టే, భూమి పడ్నేకర్ నటించారు. ఈ వెబ్ సిరీస్ లో బాగా పాపులర్ అయింది కియారా అద్వాని. విపరీతంగా బాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ ని సంపాదించుకుంది. కంప్లీట్ అడల్ట్ కంటెంట్ తో ఈ వెబ్ సిరీస్ యూత్ నే కాదు ముసలి ముతక జనాలని టెంప్ట్ చేసింది. ఇప్పుడు అలాంటి ఒక అడల్ట్ కంటెంట్ తో తెలుగులో వెబ్ సిరీస్ రూపొందనుంది. తెలుగు సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లు ఉండరనేది హైదరాబాద్ లో బీచ్ ఉండదు అన్నంత వాస్తవంగా మారింది. 

 

అయితే ఇలాంటి చోట కూడా ఈషా రెబ్బా లాంటి కొందరు తెలుగు భామలు హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఇప్పటికి కొన్ని హిట్ సినిమాల్లో నటించినా ఎందుకో ఈషా కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. జనాలలో అంతగా క్రేజ్ కూడా రాలేదు. జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికి ఈ బ్యూటీకి ఒరిగిందేమి లేదు. ఇక ఈ శుక్రవారం విడుదలైన 'రాగల 24 గంటల్లో' సినిమాలో ఈషా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా హిట్ అయితే ఈషా కెరీర్ లో ఓ మెట్టు పైకి ఎక్కుతుందని అనుకున్నారు. కానీ ఈషా ఆశలన్ని ఆవిరైపోయాయని తెలుస్తోంది.  

 

'రాగల 24 గంటల్లో' సినిమాకు అటు రివ్యూలు ఇటు మౌత్ టాక్ రెండూ అతి దారుణంగా నిరాశపరిచాయి. చిన్న సినిమాలకు హిట్ టాక్ వస్తేనే థియేటర్లలో నిలబడడం లేదు.. ఇక మిక్స్డ్ టాక్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. జయాపజయాల సంగతి పక్కనబెట్టి ఈషాకు తన పాత్ర విషయంలో ఏమైనా మంచి మార్కులు వస్తాయా అంటే..పాపం అదీ దక్కలేదు. అంతంత మాత్రంగా డిజైన్ చేసిన క్యారెక్టర్ లో ఈషాకు చేయడానికి ఏమీ మిగలలేదని సినిమా చూసిన జనాలు పెదవి విరిచారు. కాస్తో కూస్తో గ్లామర్ గా కనిపించినప్పటికి, అంతో ఇంతో అందం ఉన్నప్పటికి ఈషా సినిమా కెరీర్ నత్త నడక కంటే దారుణంగా సాగుతోంది.  

 

ఒక తెలుగు అమ్మాయి ఈమధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం గొప్ప విషయమే.. కానీ సినిమాలో సత్తా లేని కారణంగా ఈషాకు నిరాశ తప్పేలా లేదు. కెరీర్లో మంచి బ్రేక్ కోసం ఈషా తెలుగు 'లస్ట్ స్టోరీస్' పైనే నమ్మకం పెట్టుకుందని తాజా సమాచారం. సాఫ్ట్ అండ్ కమర్షియల్ సినిమాలలో రాని క్రేజ్ లస్ట్ స్టోరిస్స్ తో ఖచ్చితంగా వస్తుందని నమ్మకంగా ఉందట. ఎందుకంటే కావలసినంత గ్లామర్ ని చూపించేసి జనాలని ఆకట్టుకుందామన్న ఆలోచనలో ఉందట. మరి ఈ లస్ట్ స్టోరీసైనా ఈషాని ఆదుకుంటాయో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: