సినిమారంగంలో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం రావడం చాలా అరుదు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త కొత్త ముద్దుగుమ్మలు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ అవకాశాల కోసం తెగ వెంపర్లాడుతుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఏదో ఒక జాక్ పాట్ తగిలి కొంతమంది హీరోయిన్లు సెటిల్ అయిపోయి వరుస అవకాశాలు దక్కించుకుంది స్టార్ హీరోయిన్లు గా వెలిగిపోతూ కెరియర్ కొనసాగిస్తుంటారు. ఇదే క్రమంలో కొంతమంది హీరోయిన్లు కొన్ని అవకాశాలు వదులుకొని ఆ తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత తెగ బాధ పడుతుంటారు. హీరోలు కూడా ఇదే విధంగా కొన్ని కొన్ని సమయాల్లో ఫీలవుతుంటారు...చేతిదాకా వచ్చిన సినిమా చేజారిపోనీయక వేరేవాడు ఆ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాక ఈ విధంగా ఫీలవుతుంటారు.

 

ఇదే క్రమంలో తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో నటించే అవకాశం వచ్చినా కానీ చేయకపోవడం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం తో లావణ్య త్రిపాటి తాజాగా బాధపడుతున్నట్లు ఈ విషయాన్ని ఇటీవల బయటపెట్టింది. విషయంలోకి వెళితే అర్జున్ సురవరం అనే సినిమాలో లావణ్య త్రిపాటి నటించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లావణ్య త్రిపాటి షాకింగ్ కామెంట్ చేసింది.

 

విజయ్ దేవరకొండ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన 'గీత గోవిందం' సినిమా చేసే అవకాశం వచ్చిందని అయితే తాను చేయనందుకు ఇప్పటికీ ఆ సినిమా గురించి బాధపడుతున్నట్లు చెప్పుకొంది. అంతేకాకుండా తన కెరీర్లో ఈ అవకాశం వదులుకోవడం చాలా పెద్ద తప్పు గా భావిస్తున్నట్లు లావణ్య త్రిపాఠి పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నాయని అయితే సరైన పాత్ర కోసం వెయిట్ చేస్తున్నట్లు లావణ్య త్రిపాటి పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: