హీరోయిన్ అంజలి తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలోనే తన కెరీర్ మొదలుపెట్టి అక్కడ చాలా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఒకానొక దశలో అయితే ఈమె జోరు మామూలుగా సాగలేదు. మీడియం రేంజ్ సినిమాలలో హీరోయిన్ గా మరియు పెద్ద సినిమాలలో కీలక పాత్ర లతో దూసుకెళ్లింది. వరుసగా హిట్ ల మీద హిట్ లు కొట్టింది. అయితే అంతా సవ్యంగా సాగుతూ తమిళంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతున్న ఈమె కెరీర్ ఒక్కసారిగా భారీగా దెబ్బ తగిలింది. ఆమె మరో స్థాయికి ఎదుగుతున్న దశలో ఒక నిర్మాత మరియు దర్శకుడితో జరిగిన గొడవ కారణంగా ఆమె కొన్నేళ్ల విలువైన తన కెరీర్ నష్టపోయింది.

 

దాని తర్వాత మళ్లీ సినిమాల్లో నటించి పుంజుకునే ప్రయత్నం చేసిన అంజలి తెలుగులో కూడా అప్పుడప్పుడు అవకాశాలు వస్తూ ఉండేవి. అయితే అప్పుడే అప్పుడే తన కెరీర్ చక్కదిద్దుకుంటున్న సమయంలో జై అనే కథానాయకుడితో ఆమె ప్రేమాయణం మొదలైంది. సరే వారి బంధం సవ్యంగా సాగి ఉంటే అంజలి కెరీర్ పరంగా బాగానే ఉండేది కానీ అది కూడా ఎంతో కాలం సాగకపోవడంతో మళ్ళీ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత తేరుకొని సినిమాల పై ఫోకస్ పెట్టినా ఆమె కెరీర్ మాత్రం అంతంతమాత్రంగానే సాగుతోంది.

 

ఐతే అంజలి సెకండ్ ఇన్నింగ్స్‌లో పుంజుకోకపోవడానికి జైయే కారణం అంటూ తాజాగా నందకుమార్ అనే నిర్మాత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం గమనార్హం. ఇతను జై, అంజలి కాంబినేషన్లో ‘బెలూన్’ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అందుకు ముఖ్య కారణం జైయే అని నందకుమార్ ఆరోపిస్తూ.. అంజలి కెరీర్‌ను కూడా అతను నాశనం చేశాడని విమర్శించాడు.

 

సదరు నిర్మాత మాట్లాడుతూ జై తో ఆమె రిలేషన్ షిప్ మొదలయ్యాక అంజలికి కెరీర్ మీద అంత శ్రద్ధ లేదని ఆమె ఆలోచనలు మారిపోయాయి అని అన్నాడు. అతను నిర్మించిన 'బెలూన్' షూటింగ్ సందర్భంగా ఒక ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ లో రూం బుక్ చేశామని అయితే తనకు ఇచ్చిన రూమ్ లో జై అసలు ఉండేవాడు కాదని చెప్పాడు. ఎప్పుడూ అంజలి గదిలోనే అతను ఉండేవాడిని మరియు రూమ్ ఎప్పుడు ఖాళీగా ఉంచి నిర్మాత డబ్బులు వృధా చేయించే వాడు అని కూడా చెప్పాడు. అంతేకాకుండా సినిమా చిత్రీకరణ సమయంలో అంజలిని ఈ 'రాజా రాణి' హీరో బాగా ఇబ్బంది పెట్టాడని... షూటింగులకి కూడా సరిగ్గా రానివ్వకుండా అంజలిని తప్పుదోవ పట్టించాడని నందకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: