జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీ ఖాయమైపోయిందని సినీ మీడియా కోడై కూసింది. దీనికి సంబంధించిన అధికారికంగా ఏమీ ప్రకటన రాకపోయినా సినీ వర్గాల ద్వారా అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హిందీ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌లో ఆయన నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి.

 

బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్, టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు విషయమై చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ.. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని జోరుగా ప్రచారం జరగుతోంది. అంతే కాదు.. ఏకంగా సినిమా టైటిల్‌ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం.

 

ఇంతకీ ఆ టైటిల్‌ ఏమిటంటారా.. అదే ‘లాయర్‌ సాబ్‌’. ఈ సినిమాలో పవన్ పాత్రను బట్టి ఈ టైటిల్ అయితేనే బావుంటుందని యూనిట్ భావిస్తోందట. దీంతో పాటు మరికొన్ని టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నా.. ఈ లాయర్ సాబ్ వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోందట. ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించబోతున్నారన్న సంగతి కూడా తెలిసిందే.

 

టైటిల్ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. లాయర్ సాబ్ పేరు బావుంటుందని భావిస్తున్నారు. ముందుగా ఫీలర్ వదలి... ఫ్యాన్స్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా టైటిల్ ఖాయం చేసే ఉద్దేశ్యం కనిపిస్తోంది. మరి ఈ లాయర్ సాబ్ టైటిల్ అవునో, కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కొసమెరుపు ఏంటంటే.. అసలు ఈ చిత్రంలో పవన్‌ నటిస్తారా లేదా? అన్నదానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. స్పష్టత రాకముందే టైటిల్‌ నెట్టింట ఆసక్తి పెంచుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: