తెలుగు చిత్రసీమలో కొన్ని ఏళ్ళు టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రియా సరన్ వయసు ఇప్పుడు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దాదాపు టాలీవుడ్ లోని అగ్రతారలందరితో జోడీ కట్టేసిన ఈ డెహ్రాడూన్ భామ దాదాపు రెండు దశాబ్దాల నుంచి విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది. చెబితే నమ్మరు గాని ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు. గత సంవత్సరమే తన వైవాహిక జీవితం ప్రారంభించిన నిజం చెప్పాలంటే శ్రియ క్రేజ్ పదేళ్ల కిందటే తగ్గిపోయింది. తమిళంలో కూడా పెద్ద సినిమాల్లో నటించిన ఈ స్లిమ్ బ్యూటీకి బాలీవుడ్ లో కొన్ని రోజులు బాగానే కాలం సాగింది.

 

అయితే ఇలా తమ క్రేజ్ తగ్గిపోయిన దశలో చాలామంది అక్క వదిన పాత్రలు చేస్తూ ఉంటారు. అటువంటి పాత్రలకు కూడా తమ ఇమేజ్ తగ్గిపోయిన తర్వాత బ్రేక్ తీసుకొని రీ-ఎంట్రీ ఇస్తూ చేస్తుంటారు. కానీ ఆమె పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి శ్రియ ఏదో ఒక సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తూ తను ఒకరు ఉన్నానని ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే ఉంది. దీనంతటికి కారణం శ్రియా లో ఇంకా వన్నె తగ్గిన సౌందర్యం మరియు ఆమె ఎంతో కట్టుదిట్టంగా మెయింటైన్ చేస్తున్న బాడీషేప్. తను వచ్చిన కెరీర్ తొలినాళ్లలోనే జీరోసైజ్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన శ్రియ ఏ ఒక దశలో కూడా తన ఫిగర్ ను కొంచెం కూడా తేడా రానివ్వలేదు. ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తూ ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోయిన్లకు కు చాలెంజ్ లు ఇస్తూ ఒక బెంచ్ మార్కును పెట్టింది.

 

ఇప్పుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో శ్రియసినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హిట్ 'అసురన్' రీమేక్‌లో వెంకీ నటించనున్న సంగతి తెలిసిందే. నడివయస్కుడి పాత్రకు జోడీగా ఒక సీనియర్ హీరోయిన్ కావాల్సి ఉండగా.. ముందు నయనతార అనుకుని ఆమె చాలా కాస్ట్లీ అనే అభిప్రాయంతో ఇప్పుడు శ్రియకు ఫిక్సయ్యారట. ఆమె కూడా మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకుందట. సీనియర్ల పక్కన ఈ తరం హీరోయిన్లను పెట్టడం కష్టం కావడంతో శ్రియ, త్రిష లాంటి వాళ్లకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: