వాళ్లంతా ఒకప్పటి సూపర్ స్టార్లు.. 40 ఏళ్ల క్రితం వెండితెరను ఊపిసిన వాళ్లు.. తెలుగు, తమిళం, మలయాళం.. కన్నడం.. మొత్తం సౌత్ ఇండియానే షేక్ చేసిన వాళ్లు.. కానీ కాలం ఒకేలా ఉండదు కదా.. వారిలో కొందరు ఇప్పటికీ స్టార్ డమ్ నిలబెట్టుకుంటూనే ఉన్నారు. మరికొందరు క్రమంగా ఫేడ్ అవుట్ అయ్యారు.

 

అయితేనేం.. వాళ్లంతా ఒక బ్యాచ్,.. ఇప్పటికీ ఏటా ఏడాదికోసారి ఒక చోట కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. ఎన‌భైల‌ నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్రతియేటా వార్షికోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్సవ పార్టీ.. అందుకే ఈ స్పెషల్ ఈవెంట్ తన ఇంట్లోనే నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి.

 

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూప‌క‌ల్పన చేయ‌డ‌మే గాక‌.. ఆయ‌నే హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ రీ యూనియ‌న్ మీట్ లో ఈసారి 1980 - 1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్నడం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

 

ఈవెంట్ ను ఇలా నిర్వహించడం ఇది పదోసారి. గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి. ప‌దో సారి కావడంతో ఘ‌నంగా మెగాస్టార్ ఈ వేడుక‌ల్ని స్వయంగా నిర్వహించారు. ఇంత మంది నటీనటుల్ని ఒకే ఫ్రేమ్ లో బంధించిన ఆ కెమేరా ఎంత అదృష్టం చేసుకుందో అనిపించేలా ఉంది కదా...ఈ ఫోటో. సాధారణంగా పూర్వ విద్యార్థులు ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటారు. ఇది తారల స్పెషల్ అన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: