పవన్ కళ్యాణ్ ఎన్నికల ఓటమి తరువాత తిరిగి జనంలోకి రావడానికి ఇసుక మాఫియా సమస్యను ఇంగ్లీష్ మీడియం నిర్భందం విషయాన్ని ఆసరాగా తీసుకుని తన మార్క్ స్పీచ్ లతో ఘాటైన కామెంట్స్ చేస్తూ మళ్ళీ జనం మధ్య తన ఇమేజ్ ని పెంచుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను నిర్భంధం చేసి తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తివేసే నిర్ణయం తీసుకోవడంతో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోంది అంటూ ఒక సామాజిక ఉద్యమానికి తెర తీసాడు.

ఇలాంటి పరిస్థితులలో నిన్న ప్రధానమంత్రి మోడీ అంతర్జాతీయ స్థానికి భాషల సంవత్సరం సందర్భంగా తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అంటూ కామెంట్స్ చేసారు. మనిషి సర్వోన్నతికి సొంత భాష మాత్రమే ఆధారం అంటూ మోడీ చేసిన కామెంట్స్ పవన్ సామాజిక ఉద్యమానికి పరోక్షంగా మద్దతును ఇస్తున్నాయి. 

దేశంలో ప్రతి కొన్ని కిలోమీటర్లకు నీటి రుచి మారుతుందని అదేవిధంగా దేశంలో కొన్ని మైళ్ళ దూరం వెళ్ళగానే అక్కడ భాష యాస కూడ మారుతుందని వీటన్నిటిని రక్షించుకోవడం భారతీయ సంస్కృతికి చాల అవసరం అంటూ మోడీ వ్యాఖానించారు. భారతమాత కు 130 ముఖాలు ఉండి ఒకే శరీరం అయితే ఆమె 18 భాషలు మాట్లాడుతూ ఒకే విధంగా ఆలోచిస్తుంది అంటూ మోడీ సుబ్రహ్మణ్య భారతి వ్రాసిన కవితను ఉటంకించారు.

అంతేకాదు ఈరోజు నుండే ఎవరికి వారు వారి భాషను వారి యాస ను రక్షించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ మోడీ మాతృభాష ప్రాముఖ్యతను వివరించారు. దీనితో పవన్ ప్రస్తుతం చేపట్టిన తెలుగు పరిరక్షణ ఉద్యమానికి పరోక్షంగా మోడీ మద్దతు లభించినట్లు అయింది. గత కొంత కాలంగా ‘జనసేన’ అడుగులు భారతీయ జనతాపార్టీ వైపు పడుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో మోడీ పరోక్షంగా పవన్ భావజాలానికి మద్దతు ఇచ్చారు అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: