తన కెరీర్ తొలినాళ్లలో వరుణ్ సందేశ్ కాలేజి హీరో పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతను నటించిన 'హ్యాపీడేస్', 'కొత్తబంగారులోకం' మరియు 'కుర్రాడు' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. నటుడిగా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అందరూ అతని అంచనా వేస్తున సమయంలో అతని కెరీర్ మారిన తీరు మరియు అతనిప్పుడు ఉన్న డైలమా గురించి అందరికీ తెలిసిందే. మూడేళ్లుగా ఛాన్సులు లేకుండా సతమతమవుతున్న వరుణ్ సందేశ్ వితిక షేరుని పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాడు. అడపాదడపా సినిమాలు చేసినా అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయే కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది అతని పరిస్థితి. 

 

ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ పుణ్యమా అని అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అని చెబుతున్నాడు ఈ కుర్ర హీరో. తెలుగు లోనే అతి పెద్ద రియాలిటీ షో లో టాప్-5 లో నిలిచిన వరుణ్ కొద్దిలో టైటిల్ మిస్ అయ్యాడు అనే చెప్పాలి. అయితే తన శ్రమ ఏమీ వృధా పోకుండా ఇప్పటివరకు దాదాపు పది స్క్రిప్టులు విన్నాడట వరుణ్. అందులో ఒక మల్టీస్టారర్ కు కూడా ఓకే చెప్పేశాడట.

 

తాజా ఇంటర్వ్యూలో చారిత్రకంగా పాపులారిటీ ఉన్న ఓరుగల్లు నేపథ్యంలో ఓ సినిమా చేస్తానని చెబుతున్నాడు. వర్షం- ఎంసీఏ లాంటి సినిమాలు వరంగల్లు (ఓరుగల్లు) బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కి పెద్ద విజయం సాధించాయి. హైదరాబాద్ కి ధీటుగా అభివృద్ది చెందుతోన్న నగరం కూడా ఇది. చారిత్రక ఆధారాలతో ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే ఈ తరహా కథతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.

 

అంతా బాగానే ఉంది కాని దాదాపు వరుణ్ సినిమాలో కనిపించి నాలుగేళ్లయింది. మధ్యలో రెండు సినిమాలు మొదలుపెట్టినా అవి కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని అంటున్నాడు కానీ ఆడియన్స్ అతనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అసలైన ప్రశ్న. మన తెలుగులో ఇలా కంబ్యాక్ ఇచ్చి సక్సెస్ అయిన హీరోలు అయితే చాలా తక్కువ. చూద్దాం వరుణ్ తలరాత ఎలా రాసి ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: