సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఖచ్చితమైన నిర్ణయాలతో ఎదగడం మరొక ఎత్తు. ముఖ్యంగా కొత్త వారికి మరియు ఇంకా పరిశ్రమలో గట్టిగా స్థిరపడని వారికి బ్రేక్ ఇచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటిలో ఏవి ఆడతాయి మరియు ఏవి ఆడకపోయినా తనకు పేరు తెస్తాయి అని ఆలోచించుకొని కచ్చితంగా అంచనా వేసిన వారికే స్టార్ డమ్ దక్కుతుంది. పొరపాటున ఇక్కడ తప్పటడుగు వేస్తే మాత్రం ఉన్నచోటే ఆగిపోవాల్సి వస్తుంది. ఈ విషయం ఇప్పటికే ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్లు ధ్రువీకరించారు కూడా. 

 

నిజం చెప్పాలంటే చాలా చిన్న చిత్రంగా విడుదలై గీత గోవిందం చివరికి వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ అబ్బుర పరిచింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట లావణ్య త్రిపాఠి ని వివరించింది. అమె ఆ పాత్రకి నో చెప్పడంతో అది కాస్తా అను ఎమ్మాన్యూయెల్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఆమె కూడా గీతగా మారేందుకు ఆసక్తి చూపకపోవడంతో చివరికి ఆ అవకాశాన్ని రష్మిక రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఇప్పుడు రేష్మిక కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లావణ్య మరియు అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితి ఎలా ఉందో కూడా ప్రస్తావించక్కర్లేదు.

 

లావణ్య త్రిపాఠి నటించిన 'అర్జున్ సురవరం' ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గీత గోవిందం సినిమా చేయనందుకు నేను ఎప్పటికి బాధ పడుతూనే ఉంటాను. ఆ సినిమాను వదులుకోవడం చాలా పెద్ద తప్పుగా నేను భావిస్తున్నాను అంటూ విపరీతంగా వాపోయింది ఈ అమ్మడు. ఇక నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' ఎన్నో అడ్డంకులను దాటుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఇదైనా లావణ్య కెరీర్ ను కరెక్ట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో....

మరింత సమాచారం తెలుసుకోండి: