మెగాస్టార్ తన పాత ఇల్లుని రీ మోడలింగ్ చేశారు. ఇంట్లో ఎన్నో మార్పులు చేశారు. బ్రహ్మాండంగా కట్టుకున్న ఇంట్లో తన అలనాటి సహచర నటులకు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. అది ఎయిటీస్ బ్యాచ్ కి చెందిన నటులందరికీ పండుగ అయింది. 1980 దశకంలో పరిచయం అయి ఆ తరువాత నటులుగా సుదీర్ఘ ప్రస్తానం సాగించిన వారంతా ఇపుడు తీరుబాటుగా ఏడాదికి ఒకచోట చేరి కలుసుకోవడం పెద్ద ముచ్చట.

 

ఇప్పటికి తొమ్మిది మీటింగులు అలా చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల జరిగాయి. 10వ మీటింగ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంట్లో జరిగింది. దీనికి 1980 నాటి తారలు అంతా హారరయ్యారు. రాధిక, జయప్రద, జయసుధ, అమల,  రమ్యక్రిష్ణ, శోభన, లిజీ, మోహన్ లాల్, నాగార్జున, వెంకటేష్, భానుచందర్, నరెష్, సురేష్ వంటి వారు  వచ్చారు.

 

ఇంతమంది వచ్చినా కూడా ఒక పెద్ద వెలితి మాత్రం ఉంది. అదేంటి అంటే తమిళనాడు కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ రాలేదు. ఈ ఇద్దరు ఇప్పటివరకూ ఎక్కడా మిస్ అవలేదు. కానీ మెగాస్టార్ తొలిసారి హైదరాబాద్ లో  ఇచ్చిన పార్టీకి రాకపోవడం ఏంటన్న చర్చ వచ్చింది. అయితే వారికి వేరే బిజీ పనులు ఉన్నందువల్ల రాలేదని అంటున్నారు. కానీ రాకపోవడం పెద్ద లోటుగానే చెప్పాలి.

 

అయితే వచ్చిన తారలు సందడి చేస్తూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదుట. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ కి పెద్ద స్టార్ అయిన మెగాస్టార్ ఇచ్చిన పార్టీ, పైగా ఆయన కొత్త ఇంట్లో అంటే అందరూ ప్రేమగా రావడమే కాకుండా మెగాస్టార్ తో తమ అనుబంధాన్ని ఒకటికి పది మార్లు నెమరువేసుకున్నారు. ఓ విధంగా ఇది మరపురాని మధురానుభూతిని మిగిల్చిందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: