కొన్నాళ్లుగా 1980'స్ హీరోలంతా కలిసి క్లాస్ ఆఫ్ ఎయిటీస్ గా అందరు కలిసి ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది పరిశ్రమలకు సంబందించిన స్టార్స్ అంతా కలిసి ఒకచోట చేరి ఆట పాటలతో ఎంటర్టైన్ అవుతారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ ఈవెంట్ ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగింది.

 

అన్ని భాషలకు సంబందించిన 40 మంది స్టార్స్ అంతా కలిసి చిరు ఇంట్లో సందడి చేశారు. స్టార్ రీయూనియన్ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అంటూ వీరు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తెలుగు పరిశ్రమ నుండి ఈ ఈవెంట్ కు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నరేష్, సురేష్ వంటి స్టార్స్ అటెండ్ అయ్యారు.

 

అయితే నందమూరి నట సిం హం బాలకృష్ణ మాత్రం మిస్ అయ్యాడు. బాలకృష్ణఈవెంట్ కు కావాలనే మిస్ అయ్యాడా లేక షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయాడా అన్నది తెలియదు కాని క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ఈవెంట్ లో బాలకృష్ణ మిస్ అవడం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. బహుశా ఆ సినిమా పూర్తి చేసే పనిలోనే బాలయ్య బాబు ఈ ఈవెంట్ కు మిస్ అయ్యాడని అంటున్నారు. ఇక ఈ ఈవెంట్ కు అందర్ స్టార్స్ డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

 

అందరు బ్లాక్, గోల్డ్ కాంబినేషన్ కాస్టూంస్ తో అలరించారు. చిరు ఇంట్లోనే ఈ ఈవెంట్ జరిగింది. అక్కడే ఫుల్ పార్టీ చేసుకున్నారట. ఇలా అన్ని భాషలకు సంబందించిన స్టార్స్ ఒకచోట చేరి పార్టీ చేసుకోవడం మంచి విషయమని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం ఒక్కో చోట జరుపుకుంటున్న క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ఈవెంట్ ఈ ఇయర్ చిరు ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: