వి6 తీన్మార్ వార్తలతో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు బిత్తి సత్తి అలియాస్ చేవెళ్ల రవి, తీన్మార్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి. బిగ్ బాస్ సీజన్ 3లో శివ జ్యోతి కంటెస్టంట్ గా వెళ్లగానే బిత్తిరి సత్తి చిన్నగా వి6 ని వదిలిపెట్టి టివి-9 లో చేరాడు. ఇస్మార్ న్యూస్ అంటూ ఓ కొత్త షో స్టార్ట్ చేశాడు. అయితే వి-6 తీన్మార్ వార్తల్లా సంచలనం సృష్టించలేకపోయింది.    

 

శివ జ్యోతి హౌజ్ లో ఉండగానే బిత్తిరి సత్తి టివి-9లోకి వెళ్లాడు. బయటకు వచ్చిన ఆమె బిత్తిరి సత్తి నిర్ణయాన్ని తెలుసుకుని షాక్ అయ్యింది. అయితే సత్తి లేకుండా తీన్మార్ వార్తలు నడవడం కష్టమే. అందుకే శివ జ్యోతి కూడా టివి-9కి జంప్ అయ్యిందని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ కాబట్టి ఇద్దరు మళ్లీ టివి-9లో ఆ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు.

 

ఇస్మార్ట్ న్యూస్ ను మరింత స్మార్ట్ గా చేసేందుకు శివ జ్యోతి కూడా టివి-9లోకి ఎంట్రీ ఇస్తుంది. మొత్తానికి బిత్తిరి సత్తితో పాటుగా ఊహించినట్టుగానే శివ జ్యోతి కూడా ఛానెల్ మారిందని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరికి టివి-9లో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నారట. బిత్తిరి సత్తి ఆల్రెడీ ఇస్మార్ట్ న్యూస్ అని ప్రారంభించాడు. అయితే తీన్మార్ వార్తల్లాగా అది క్లిక్ అవలేదు.

 

అందుకే ఇక ఇప్పుడు శివజ్యోతితో కలిసి ఆ షోని నడిపించాలని చూస్తున్నారు. ఎంతైనా హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ ఇద్దరు మళ్లీ టివి-9లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నారు. ఈమధ్య బిత్తి సత్తి సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఏది ఏమైనా బిత్తిసత్తిగా తనకు ఓ బ్రాండ్ ఏర్పాటు చేసేలా అవకాశం ఇచ్చిన వి-6 ఛానెల్ కు ఈ ఇద్దరు పెద్ద షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: