మంచు విష్ణు సినిమా వచ్చి చాలా రోజులైంది. ఈ మధ్య మంచు విష్ణు సినిమాలకి మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఆచారి అమెరికా యాత్ర, గాయత్రి, ఓటరు సినిమాల పరిస్థితి మరీ దారుణంగా అయింది. ఈ సినిమాలు కనీసం రిలీజ్ ఖర్చులని కూడా వెనక్కి తీసుకురాలేదు. అయితే దాంతో మంచు విష్ణు తన తర్వాతి సినిమాకు గ్యాప్ తీసుకున్నాడు. ఒక దశలో మంచు విష్ణు ఇక సినిమాలు చేయడేమో అనే సందేహం కూడా కలిగింది.

 

కానీ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మంచు విష్ణు ఒక హాలీవుడ్ మూవీకి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మొన్ననే విడుదలైంది. మోసగాళ్ళు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల అవుతుంది. కాజల్, నవదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జెఫ్రీ చిన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విష్ణు పెద్ద ప్లానే వేశాడట.

 

మోసగాళ్ళు సినిమాని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాలని అనుకుంటున్నాడట. తద్వారా సినిమా మీద అంచనాలను పెంచాలని భావిస్తున్నాడట. ఇంగ్లీష్ లో కూడా విడుదల చేస్తుండడంతో కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తే మరోలా ఉంటుందని భావిస్తున్నాడట. అయితే కేన్స్ ఫెస్టివల్ లో సినిమా ప్రదర్శితం కావాలంటే సినిమాలో మంచి సరుకు ఉండాలి. అలాంటి సరుకు మోసగాళ్ళు చిత్రంలో ఉందని మంచు విష్ణు భావిస్తున్నాడట.ఈ మేరకు కేన్స్ వారితో సంప్రదిస్తున్నారని టాక్

 

 

మరి తెలుగులోనే మార్కెట్ కోల్పోయిన మంచు విష్ణు మోసగాళ్ళు చిత్రం ద్వారా ఇంగ్లీష్ లో విజయం సాధిస్తాడా అన్నది సందేహమే. ఇకపోతే అతి పెద్ద ఐ టీ స్కామ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా గనక విజయం సాధిస్తే విష్ణు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: