ఐపీఎ ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫ్రాంఛైజీలన్నీ ఐపీలఎల్ వేలం కోసం రెడీ అవుతున్నాయి. ఐపీఎల్ వేలం  డిసెంబరు 19 వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఎవరెవరిని తీసుకోవాలా అనేది ప్లాన్స్ వేసుకుంటున్నాయి. దాంతో కొందరి ఆటగాళ్ళ విషయంలో ఫ్రాంచైజీల మధ్య విపరీతంగా పోటీ ఉండనుంది. అయితే ముఖ్యంగా ఒక ఆటగాడి కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఆ ఆటగాడే క్రిస్ లిన్. 

 

గత సీజన్లో క్రిస్ లిన్ కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడి మంచి పర్ ఫార్మెన్స్ తో విజయాలని అందించడంలో సాయపడ్డాడు. అయితే అనూహ్యంగా కోల్ కతా క్రిస్ లిన్ ని వదులుకుంది. అంత మంచి ఆటగాడిని వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సారి వేలంలో మూడు జట్లు అతన్ని తీసుకోవాలని చూస్తున్నాయి. మొదటగా, చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ లో బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. 

 

షేన్ వాట్సన్, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లతో చాలా పటిష్టంగా ఉంది. కానీ షేన్ వాట్సన్ గాయం కారణంగా ఇబ్బంది పడుతుండడంతో, ఆ బ్యాటింగ్ లైన్ప్ ని మరింత పటిష్టం చేయడానికి క్రిస్ లిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నాయి. ఇక రెండో జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బెంగళూరులో స్వదేశీ ఆటగాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదీ గాక బ్యాటింగ్ పరంగా ఒత్తిడి మొత్తం కోహ్లీ, డివిలియర్స్ పైనే పడనుంది. 

 

అందుకని వారి ఒత్తిడిని దూరం చేసే క్రమంలో మరో బ్యాట్స్ మెన్ ని తీసుకోవాలని చూస్తుంది. దానికి క్రిస్ లిన్ అయితే స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించగలడని భావిస్తుంది. ఇక మూడో జట్టు కోల్ కతా నైట్ రైడర్స్. క్రిస్ లిన్ ని  వదులుకున్న టీమ్ మళ్ళీ కావాలనుకుంటోంది. అయితే దానికి కారణం లేకపోలేదు. గత సీజన్ లో క్రిస్ లిన్ ని 9.3 కోట్లకి కొనుక్కున్నారు. ఈ సారి కూడా అంత ధర చెల్లించడం ఇష్టం లేక అతన్ని వదులుకుని వేలంలో తమకు కావాల్సిన ధరలో కొనుక్కోవడానికి సిద్ధం అవుతోంది. మరి ఈ ముగ్గురి మధ్య జరిగే పోటీలో క్రిస్ లిన్ ని ఎవరు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: