బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ‘ది లవ్ లాఫ్ లైవ్’ షోలో పాల్గొన్న ఆమె కన్నీరు పెడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదరైన వేధింపులను బయటకు తెలియచేయడం జరిగింది. 1990లో సోషల్ మీడియా అనేది లేకపోవడం చాల  బాధాకరం. దీనివల్ల మామీద వచ్చిన కాంట్రావర్సీలపై అప్పటి నటీనటులు స్పందించలేక పోయే వారని.. హీరోయిన్ల గురించి టీవీలు, పత్రికల్లో వచ్చిన వాటినే ప్రజలు గట్టిగా నమ్మేవారని చెప్పుకొచ్చింది. నాపై వచ్చిన కొన్ని కాంట్రావర్సీల విషయంలో ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

 

Image result for Raveena Tandon

 

2018లో ప్రారంభమైన మీ టూ ఉద్యమం గురించి స్పందిస్తూ ఒకవేళ ఆ రోజుల్లో కనుక నాకు సోషల్ మీడియా అందుబాటులో ఉంటే.. ఎందరో జీవితాలను బయట పెట్టే దాన్ని అని సంచలన వ్యాఖ్యలు చేశారు రవీనా టాండన్. చాలామంది లైంగికంగా వేధించడమే కాకుండా అవకాశాలు రాకుండా చేసేందుకు ప్రయత్నించారని తెలియచేసింది. ఇండస్ట్రీలో కొంతమంది నాపై అనవసర పుకార్లు పుట్టించారని, స్నేహంగా ఉండే వారి మధ్య సంబంధాలు అంటగట్టి ఫ్యామిలీల్లో తల ఎత్తుకోకుండా చూశారని భావోద్వేగానికి గురి అవ్వడం జరిగింది. 

 

Image result for Raveena Tandon

 

ఆంటీ, లాడ్లా, దుల్హే రాజా, అందాజ్ అప్నా, ఘర్ వాలీ బహర్ వాలీ.. వంటి వరుస సూపర్ హిట్స్ తో రవీనా టాండన్ ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. దీంతో అందరి అభిమానాలను సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలదొక్కుకున్నారు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రవీనా టాండన్ తన ఫస్ట్ క్రష్ అని ఓ సందర్భంలో చెప్పాడు. అంటే రవీనా టాండన్ తన అంద చందాలతో అప్పట్లో ఏరేంజ్ లో సినీ ఇండస్ట్రీని ఊపేసిందో అర్థం అవుతుంది సులువుగా. 

మరింత సమాచారం తెలుసుకోండి: