బాలీవుడ్ ఇండస్ట్రీలో  సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా ‘వీర్’ సినిమాలో నటించి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది జరీన్ ఖాన్. చూడటానికి అచ్చం బార్బీ డాల్ కత్రినా కైఫ్‌లా ఉందని సల్మాన్ ఈమెకు తన సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ కత్రినా సాధించిన సక్సెస్‌లో సగం కూడా సాధించలేకపోయింది ఈ హాట్ బ్యూటీ. ఏదో ఒకటిలే అనుకుంటూ వచ్చిన పాత్రలు చేసుకుంటూపోతోంది. సెక్సువల్ సన్నివేశాలు ఉన్న పాత్రల్లోనూ నటించింది. ఇటీవల విడుదలైన ‘చాణక్య’ సినిమాలో కీలక పాత్రలో కూడా నటించింది ఈ హాట్ బ్యూటీ.

 

Image result for జరీన్ ఖాన్

 

అయితే తాజాగా జరీన్.. సేమ్ సెక్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడంలో తప్పు లేదని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ఇదే కసిపెంట్  తో సినిమాలు ఎందుకు తీయకూడదు అని అడిగింది. ఇలాంటి సినిమాలు తీయకపోతే స్వలింగ సంపర్కులకు సమాజం ఎలా సపోర్ట్ చేస్తుందని అంటోంది.

 

 

ప్రస్తుతం నేను నటిస్తున్న ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ సినిమాలో నాకు నచ్చిన పాత్రలే ఉంది. స్వలింగ సంపర్కులైన అమ్మాయి, అబ్బాయిల పెళ్లి నేపథ్యంలో రాబోతుంది ఈ సినిమా . ఇదివరకు నేను కేవలం బోల్డ్ సన్నివేశాలకు మాత్రమే పనికొస్తానని అనుకునేవారు. మున్ముందు నాకు మంచి పాత్రలు రాకపోవా అని అలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటించేదాన్ని. కానీ నాకు వేరే ఛాన్సెస్ రాలేదు. అప్పుడే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాలో ఉన్న మరో కోణాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు అని తెలిపింది.

 

Image result for జరీన్ ఖాన్

 

‘స్వలింగ సంపర్కులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది ఈ సినిమా. సాధారణ మనుషుల్లా వారు సమాజంలో జీవించలేకపోతున్నారు. ఇక సెక్సువల్ సన్నివేశాల విషయానికొస్తే అవసరమైతే అమ్మాయిలకు కూడా లిప్ కిస్సెస్ ఇస్తా. నాకేం అభ్యంతరం లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం అలాంటి సన్నివేశాల ఏమీ లేవు’ అని తెలిపింది. జరీన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 2020 న్యూఇయర్‌కు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: