స్టార్ హీరోయిన్ లను మన హీరోలే తొక్కేస్తున్నారా? ఏమో... నిజమేననిపిస్తోంది... ఎందుకంటే ఈ జనరేషన్ హీరోలు తమను డామినేట్ చేసే పెద్ద హీరోయిన్ లను తమ పక్కన నటించడానికి ఒప్పుకోవడంలేదనే సందేహం వస్తోంది. హీరోలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ హీరోయిన్ లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీంతో కాజల్ లాంటి పెద్ద హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోలతోనే... లేదా చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియ‌ర్‌ హీరోలకే పరిమితం కావాల్సి వస్తోంది... సమంత లాంటి పెరఫార్మెన్స్‌ ఉన్న హీరోయిన్ కూడా కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పరిమితం కావాల్సి వస్తోంది. తమన్నా ను పిలిచే నాధుడే కనపడడం లేదు... ఇక అనుష్క సంగతి సరే సరి... 

 

గతంలో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణ ల హయాంలో వారు తమతో పోటీపడి నటించే హీరోయిన్ లనే కోరుకునే వారు. సినిమాలో కనీసం  ఒకటి రెండు  సీన్లలో ఇద్దరు పోటీ పడి నటించేవారు...  ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకునే వారు. మరి ఇప్పుడో... ఈ జనరేషన్ హీరోలు హీరోయిన్ ఎక్కడ మన కంటే స్ట్రాంగ్ గా ఉంటే మనమెక్కడ వీక్ అయిపోతామో అనే భయంతో సమంత, సాయి పల్లవి  లాంటి హీరోయిన్ లను ఒప్పుకోవడం లేదు. రంగస్థలం లో రాంచరణ్ బాగానే చేసాడు కానీ. సమంత తన పెరఫార్మెన్సు తో అదరగొట్టేసింది కదా.... ఇటీవల కాలంలో వచ్చిన మరో ప్రతిభావంతమైన హీరోయిన్ సాయి పల్లవి... ఆమె సినిమాలో ఉంటే ఎదురుగా హీరో ఎవరైనా... ప్రేక్షకుల చూపులన్నీ సాయి పల్లవి మీదే ఉంటాయి. ఆమె తన సహజ నటనతో కట్టిపడేస్తుంది. అందుకే పెద్ద హీరోలు ఆమెను చిన్న హీరోలకే పరిమితం చేసి పడేశారు.


 మరో కోణం లో నుంచి ఆలోచిస్తే దీని వెనుక ఆర్ధిక కోణం కూడా ముడిపడి ఉంది. ఇప్పుడు సినీ నిర్మాణంలో అయ్యేదాంట్లో మేజర్ ఖర్చు హీరో రెమ్యునరేషన్... అది పది, ఇరవై, ముప్ఫయ్ దాటి నలబై, యాభయ్ కోట్లకు చేరిపోయింది. దీంతో హీరోయిన్ ను కూడా పెద్ద హీరోయిన్ ను పెట్టుకుంటే ఆమెకు కూడా 2,3 కోట్లు ఇవాల్సివస్తుందని,,, ఓ పాతిక, యాభయ్ లక్షలిచ్చి చిన్న హీరోయిన్ ను పెట్టుకుని లాగించేస్తున్నారు. మ‌రి ఇలాంటి ఒర‌వ‌డి ఉన్న స‌మ‌యంలో హీరోయిన్లు ఎలా పైకి వ‌స్తారు అన్న వాద‌న కూడా మ‌రో ప‌క్క వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: