ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోన్న విషయం మన అందరికి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఉందనే సమాచారం వస్తుంది. ఇప్పటికే సినిమాలో ఏడెనిమిది పాటలుంటాయన్న ప్రచారం జరుగ సాగుతుంది. అలాగే చెర్రీ-అలియా మధ్య రొమాంటిక్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఊహాగానాలు గట్టిగ వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ పాట కోసం ఓ భారీ సెట్ ను కూడా నిర్మిస్తున్నారుట. చెర్రీ-అలియా కలిసి ఈ పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసారు అని సమాచారం.


 
ఆసక్తికరంగా ఈ పాటను గ్రాఫికల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు జక్కన్న కృషి చేస్తున్నారు అట. ఇక సీతగా కనిపించే ఆలియా ని అల్లూరి సీతా రామరాజు (చరణ్) బైక్ రైడ్ కి కూడా తీసుకెళ్లే షాట్స్ ని ఈ పాటలో ఉన్నాయి అట. మరి ఇందులో వాస్తవమెంత? అన్నది యూనిట్ వర్గాలు స్పందిస్తే గాని తెలియదు. అయితే అల్లూరి కాలంలో బైక్ లు ఉన్నాయి. ఆంగ్లేయులు  వాటిని నడిపేవారా.?? మరి ఆలియాతో ఎలాంటి బైక్ పై చరణ్ రైడ్ చేస్తాడు? అన్నది తెరపైనే  చూడాల్సి ఉంటుంది.

 

ఇక తారక్- ఒలీవియా జంట రొమాన్స్ ని జక్కన్న ఏ స్థాయిలో ఎలివేట్ చేయనున్నాడు? అన్నది ఇంకా తెలియదు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఓలీవియా మోరిస్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో  కనిపించనుండగా ఒలీవియా జెన్నిఫర్ అనే ఆంగ్ల యువతిగా నటించనుంది.

 

కొమురం భీమ్ ని ప్రేమించే విదేశీ యువతిగా ఒలీవియా హొయలు ఆకర్షిస్తాయట. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ 70 శాతం పూర్తయింది అని చిత్ర యూనిట్ తెలిపింది.  ప్రస్తుతం మిగిలిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఫైనల్ చేసిన నేపథ్యంలో తదుపరి ఆ ఇద్దరిపైనే సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని దర్శకడు ఎస్.ఎస్.రాజమౌళి ఏకంగా 10 భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: