డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా త్వరలో నవంబర్ 29వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతున్న నేపద్యంలో ప్రస్తుతం ఈ సినిమా పై ఆంధ్ర రాజకీయాలలో మరియు సినిమారంగంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను పోలి ఉండటంతో చాలామంది రాజకీయ పార్టీల నేతలు మరియు మరియు రాజకీయ పార్టీల మద్దతు పలికే వారు ఈ సినిమాని ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చేయాలని చూస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేపాల్ స్పందిస్తూ ...రాంగోపాల్ వర్మ ఒక మూర్ఖుడు అని అటువంటి వాటిని పట్టించుకోకూడదు అంటూ వీడియో చేస్తూ...కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆపేయాలని కోరారు. రాజకీయ నేతలను కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మసినిమా తెరకెక్కించినట్లు పాల్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా లో హైలెట్ సీన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

 

అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలోకి వెళ్లకముందు రాంగోపాల్ వర్మ సినిమా చిత్రీకరించే విధానం తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో ఎంటర్ అయ్యాక ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పై అధికార పార్టీలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొత్తగా ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి యువకుడు వేసే డైలాగులు సినిమాకి హైలెట్ అని...అసెంబ్లీలో సదరు యువ ముఖ్యమంత్రిని ఆయన హావభావాలను రాంగోపాల్ వర్మ చిత్రీకరించిన విధానం సినిమాకే హైలెట్ అన్నట్లుగా ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: