తెలుగులో సంక్రాంతి పండగ అంటే ఎక్కడలేని సందడి ఉంటుంది. అయితే ఆ సందడి ప్రతీ ఇంట్లోనే కాదు థియేటర్ల దగ్గర కూడా కనిపిస్తుంది. సంక్రాంతి పండక్కి థియేటర్లలోకి కొత్త సినిమాలు చేరిపోతుంటాయి. తెలుగు సినిమాకి సంక్రాంతి చాలా పెద్ద పండగ. అందుకే అన్నీ పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతుంటాయి. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి బరిలోకి పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు కూడా పోటీ పడుతున్నాయి.

 

ఈ చిత్రాలలో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ప్రస్తుతం సంక్రాంతి బరిలోకి దిగడానికి ఎవరికి వారు సమాయాత్తమవుతున్నారు. అందుకు అనుగుణంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రమోషన్లలో బన్నీ "అల వైకుంఠపురములో" చిత్రం కాస్త ముందంజలో ఉందనే చెప్పాలి. ఈ సినిమా నుండి విడుదల అయిన మూడు పాటలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

 

అయితే మరో పెద్ద సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" కూడా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మొన్న ఈ సినిమా టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ కి అనూహ్య స్పందన లభించింది. మాస్ టీజర్ లో మహేష్  చెప్పిన డైలాగులు బాగా పేలాయి. అయితే ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల అవుతున్నాయి.

 

వీటన్నింటిలోకి ఏ సినిమా కోసం ప్రజలు ఎక్కువగా ఎదురుచూస్తున్నారనేది చూస్తే అది "మహేష్" నటించిన సరిలేరు నీకెవ్వరు కోసమే అని తేలింది. ఈ మేరకు ఐఎండీబీ వారు నిర్వహించిన సర్వేలో మోస్ట్ ఆంటిసిపేటేడ్ సినిమా గా "సరిలేరు నీకెవ్వరు" నిలిచింది. దబాంగ్ ౩ రెండవ స్థానంలో నిలిచింది. దీన్నిబట్టి మహేష్ సినిమాకున్న డిమాండ్ ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ డిమాండ్ మూలంగానే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ సైతం భారీస్థాయిలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: