మెగా బ్రదర్ నాగబాబు అనగానే టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్ షో. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి  నాగబాబు జబర్దస్త్ జడ్జి గా కొనసాగుతున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కాస్త జబర్దస్త్ షో ద్వారా  నవ్వుల నాగబాబు గా మారిపోయారు. అయితే మామూలుగా అయితే నాగబాబు అనగానే సీరియస్ గా ఉండే ఓ వ్యక్తి  గుర్తుకు వస్తారు  కానీ జబర్దస్త్ లో జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు లోని మరో కోణాన్ని ప్రజలకు పరిచయం చేశారు ఆయన. ఆయన లోపల ఎంత ఫన్నిగా ఉంటారో అందరికి తెలిసింది. అయితే గత కొన్ని రోజులుగా  జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన నాగబాబు తాను  నిజంగానే జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ యాజమాన్యానికి తనకు మధ్య కొన్ని ఐడియాలజీ సమస్యలు రావడం వల్ల జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

 


 అయితే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో జబర్దస్త్ ప్రేక్షకులకు కూడా కాస్త హర్ట్  అయ్యారు.  ఎందుకంటే జబర్దస్త్ లో నాగబాబు  నవ్వులు చూడడానికి ఎంతో మంది ప్రేక్షకులు జబర్దస్త్ చూసే వాళ్ళు ఉన్నారు. అయితే జబర్దస్త్ నుంచి తప్పుకున్న మెగా బ్రదర్ నాగబాబు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్  అనే ప్రోగ్రాం లో దర్శనమిచ్చాడు. ఇక అక్కడికి వెళ్లడం వెళ్లడమే తనదైన శైలిలో కామెడీ మొదలుపెట్టాడు మెగా బ్రదర్ . జీ తెలుగులో వస్తున్న లోకల్ గ్యాంగ్  లో తన ప్రేమ కథను చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు. 

 

 లోకల్ గ్యాంగ్ షో లో యాంకర్ గా ఉన్న ప్రదీప్ మీ లవ్ స్టోరీ చెప్పండి సార్... మీరు అప్పట్లో ఎవరైనా అమ్మాయిని ప్రేమించారా  అంటూ ప్రదీప్ అడిగాడు. అయితే ప్రదీప్ అడిగిన ప్రశ్నకు మొహమాటం లేకుండా సమాధానం చెప్పేశాడు మెగా బ్రదర్ నాగబాబు. తన కాలేజీ డేస్ లో ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలు వెంట పడేవాడిని అని...  తొమ్మిది మంది ప్రపోస్ చేశాను అని నాగబాబు తెలిపారు. కానీ అంతా ఛీ కొట్టారు  అంటూ మెగా బ్రదర్ ఓపెన్ అయిపోయాడు. అప్పట్లో తొమ్మిది మందితో  అంతా వన్ సైడ్ లవ్ అంటూ నాగ బాబు పంచ్ పేల్చాడు . ఇక నాగబాబు ఈ విషయం చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వారంతా ఇప్పుడు మీ పొజిషన్ చూసి కుళ్లుకుంటారు ఏమో సార్ అని ప్రదీప్ అనగానే... మనకి అంత లేదులే స్వామీ అంటూ తనపైన తానే సెటైర్ వేసుకుని నవ్వులు పూయించాడు నవ్వులు నాగబాబు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే జబర్దస్త్ రేంజిలో తన కొత్త షో ను  పాపులర్  చేయడానికి అందరూ బాగానే కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: