జబర్దస్త్ లో సాదా సీదా కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చిన  ఆది...  తర్వాత తన టాలెంట్ నిరూపించుకుని  ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు. మామూలు టీమ్  లీడర్ నుంచి టాప్ లీడర్ల రేసులో దూసుకుపోతున్నాడు  హైపర్ ఆది. అయితే ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులు ఎక్కువ మంది హైపర్ ఆది పర్ఫామెన్స్ కోసమే చేస్తూన్నారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు . ఎవరి స్కిట్లు చూసినా చూడకపోయినా హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే మాత్రం టీవీలకు అతుక్కుపోతారు . జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయారు హైపర్ ఆది. ఆ తర్వాత సినిమాల్లో కూడా భారీగానే ఛాన్సులు దక్కించుకున్నాడు. ఇక హైపర్ ఆది స్కిట్ మొదలైందంటే పంచుల మీద పంచులు పడాల్సిందే ముఖం మీద నవ్వు ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్  దూసుకుపోవాల్సిందే . ఏ పంచుకు నవ్వాలో కూడా   అర్థం కాకుండా పంచుల మీద పంచులు వేస్తూ ఉంటారు హైపర్ ఆది. 

 

 అయితే హైపర్ ఆదికి మెగా అభిమానిగా మంచి గుర్తింపు ఉంది. గత  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో  పోటీ చేసిన నాగబాబు కు మద్దతుగా హైపర్ ఆది అప్పట్లో ప్రచారం కూడా నిర్వహించారు. అంతే కాకుండా స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన హైపర్ ఆది. పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్న చాలామంది పై తన స్కిట్ల  రూపంలో కామెడీ పంచుతూనే సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఎన్నో స్క్రిప్ట్ లను కూడా చేశాడు హైపర్ ఆది. ఈ క్రమంలో జబర్దస్త్ జడ్జీగా ఉన్న నాగబాబు హైపర్ ఆది కి మధ్య మంచి రిలేషన్ షిప్ కూడా ఏర్పడింది. 

 

 ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ జడ్జ్  తప్పుకున్న మెగా బ్రదర్ నాగబాబు జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్ లో  జడ్జిగా ప్రత్యక్షమయ్యారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో హైపర్ అది కూడా నాగబాబు తో  వెళ్తాడు అని అందరూ అనుకున్నారు కానీ హైపర్ ఆది మాత్రం తాను జబర్దస్త్ లోనే కొనసాగుతాను  అంటూ క్లారిటీ ఇచ్చారు . దీంతో భవిష్యత్తులో మెగా ఫ్యామిలీతో హైపర్ ఆది కి కాస్త దూరం ఏర్పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోవడంతో అటు జనసేన తో ఉన్న హైపర్ ఆది రిలేషన్ రిలేషన్ పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: