కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో పింక్ బాల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. భారత్ ఆడిన మొట్టమొదటి పింక్ బాల్ మ్యాచ్ లో విజయకేతనం ఎగరవేసి సీరీస్ ని కైవసం చేసుకుంది. నిజానికి బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీ చొరవతోనే ఈ పింక్ బాల్ టెస్ట్ సాధ్యమైంది. గతంలోనే ఆస్ట్రేలియాతో భారత్ పింక్ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ అప్పుడు కోహ్లీ వద్దనడంతో మ్యాచ్ జరగలేకపోయింది. అయితే వచ్చే వేసవిలో ఆసీస్ తో సిరీస్ జరగనున్న నేపథ్యంలో పింక్ మ్యాచ్ ఉంటుందేమో అనే చర్చ జరుగుతుంది. 

 

పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌  విజయం సాధించిన తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్‌ పైన్‌ను భారత్‌తో పింక్‌ బాల్‌ టెస్టు గురించి ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. ‘మీరు భారత్‌తో పింక్‌ బాల్‌ టెస్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నారా’ అని అడిగాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్ట్ దానికి  టిమ్ పైన్ తనదైన శైలిలీ సమాధానమిచ్చాడు. భారత్ తో పింక్ మ్యాచ్ ఆడడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. అయితే అది కోహ్లీనే అడగాలి.

 

కోహ్లీ ఒప్పుకుంటే మేం ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కోహ్లీ ఒప్పికోవాలంటే మంచి మూడ్ లో ఉండాలి. మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగితేనే ఒప్పుకుంటాడు. మేం కూడా భారత్ తో పింక్ మ్యాచ్ ఆడడానికి ఎదురుచూస్తున్నాం అని చెప్పాడు. మన మాజీ క్రికెటర్లు సైతం ఆస్ట్రేలియాతో పింక్ మ్యాచ్ ఆడాలని సూచిస్తున్నారు. మరి ఆసీస్ తో పింక్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ప్రస్తుతం పింక్ మ్యాచులకి మనవాళ్ళు కూడా ఆసక్తిగా ఉండడంతో మరికొద్ది రోజుల్లో ఆసీస్ తో పింక్ మ్యాచ్ ఉండనుందని తెలుస్తుంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన ఇండియా ఆసీస్ తో పింక్ మ్యాచ్ లో విజయం సాధిస్తుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: