టాలీవుడ్ లో ఇడియట్ సినిమాతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మాస్ మహరాజ రవితేజ.  కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రవితేజ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారారు.  ఈ మూవీతో మంచి హిట్ అందుకున్న తర్వాత వరుస గా సినిమా ఛాన్స్ లు రావడం..అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’ నటించడం రవితేజకు బాగా కలిసి వచ్చింది.  పవర్ సినిమా వరకు రవితేజ స్టార్ హీరోగా వెలిగిపోడు.  కిక్ 2, బెంగాల్ టైగర్ దారుణమైన డిజాస్టర్స్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.  

 

కామెడీ దర్శకులు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు రవితేజ.  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ మొన్న రిలీజ్ అయ్యింది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో చాలా కాలం గ్యాప్ తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తుంది. 

 

గతంలో విజయశాంతి వరకు ఎంతో మంది దర్శక, నిర్మాతలు వెళ్లినప్పటికీ ఆమె సున్నితంగా తీరస్కరించారట.  అయితే ‘రాజా ది గ్రేట్’ మూవీ తెరకెక్కించే సమయంలో రవితేజ తల్లిగా మొదట విజయశాంతిని తీసుకోవాలని ఆమె వద్దకు వెళ్లాడట అనీల్ రావిపూడి. అయితే అప్పటికీ రాజకీయాల్లో బిజీగా ఉండటం..ఆ పాత్రకు నో చెప్పారట.  దాంతో ఆ పాత్రను రాధిక గారితో చేయించడం జరిగింది. 

 

ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని కీలకమైన పాత్రను మాత్రం విజయశాంతిగారితోనే చేయించాలనుకున్నాను. అయితే మహేష్ బాబు  బాల నటుడిగా ఉన్నపుడు విజయశాంతి ఆయన తల్లి పాత్రలో వేసిన విషయం తెలిసిందే.  మొత్తానికి 'రాజా ది గ్రేట్' కోసం కలిసినప్పటి  పరిచయంతోనే, 'సరిలేరు  నీకెవ్వరు' కథను విజయశాంతి కి వినిపించడం..ఆమె ఓకే చెప్పడం..నా సినిమా ద్వారానే రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనీల్ రావిపూడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: