ఒక స్టార్ కమెడియన్ హీరోగా యూ టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుందో సాధారణంగా ఆ కమెడియనే కాదు జనాలు ఊహించలేరు. హీరో సునీల్ తో పాటు ఇండస్ట్రీలో చాలా ఫేమస్ కమెడియన్ల పరిస్థితి ఇప్పుడు ఇదే. అయితే వీళ్లంతా అనే మాట ఒక్కటే. నటుడు అవ్వడమే గొప్ప అనుకుంటే హీరో అవ్వడం ఇంకా గొప్ప. మాకు హీరో అవకాశాలు రావడం నిజంగా ఆ దేవుడి దయ, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం, పూర్వ జన్మ సుకృతం అంటూ వేదాంతం వల్లిస్తూనే ఉన్నారు.

ఇక మన స్టార్ కమెడియన్ కం హీరో సునీల్ కంబ్యాక్ ఎప్పుడు? క్యారెక్టర్ ఆర్టిస్టుగా బౌన్స్ బ్యాక్ అయినా ఆశించిన సక్సస్ రావడం లేదు. ఒకవేళ హీరోగా అవకాశం వస్తే నటిస్తాడా? అంటే ఇంతవరకూ ఈ హీరో దగ్గర సరైన క్లారిటీనే లేదు. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతో హీరో అనే కోరిక తీరిందిలే అనుకుంటే రాజమౌళి మర్యాదరామన్నతో మరో బ్లాక్ బస్టర్ ని అందించి సునీల్ కి హీరో వేషాలపై మరింత మోజు పెరిగేలా చేశాడు. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాని సునీల్ తో తీశాడు. దాంతో సునీల్ ఇక ఆగలేదు. తరువాత వచ్చిన పూల రంగడు హిట్ కావడంతో సునీల్ పూర్తిగా హీరోయిజంపైనే మనసు పారేసుకున్నాడు. కేవలం హీరో అనే స్థాయికి వెళ్లిపోయాడు.

 

ఈ కారణంతోనే కామెడీ పాత్రలను పక్కన పడేశాడు. హీరో ఇమేజ్ వల్ల క్యారెక్టర్లు చేయడం మధ్యలో కుదరలేదు. ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. హీరోగా సునీల్ చేసిన సినిమాలన్నీ వరుసబెట్టి ఫ్లాపుల పాలయ్యాయి. దాంతో హీరోగా చేయడం మానేసి కమెడియన్ గా మళ్ళీ టర్న్ తీసుకున్నా ఫలితం సున్నా. సునీల్ స్నేహితుడు త్రివిక్రమ్ అరవింద సమేతలో ఛాన్సిచ్చినా .. ఆ తర్వాత పరిస్థితి అందరికి తెలిసిందే.

 

ముందున్న షార్ప్ మిస్సవ్వడమా..లేక ఫేడవుట్ అన్న భావన వల్లనో క్రమంగా సునీల్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ప్రస్తుతం సునీల్ పరిస్థితి ఏమిటి? అంటే ..ఆయన నటిస్తానంటే ఒకట్రెండు పెద్ద నిర్మాణ సంస్థలు హీరోగా అవకాశాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయట. కానీ సునీల్ మాత్రం అందుకు అంగీకరించడం లేదట. మరి తాజా సన్నివేశం చూస్తుంటే సరైన నిర్ణయం తీసుకోవడంలోనే సునీల్ తడబడుతున్నాడా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. ఇక తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటమే హీరో గా చేయమని ఎవరైనా నిర్మాత అడిగితే సునీల్ కి ఒళ్ళంతా చమటలు పట్టి ఒంటిమీద బట్టలు తడిసిపోతున్నాయట. అంటే హీరోగా చేయడానికి భయపడుతున్నాడని తెలుస్తోంది. ఇలా ఎందుకు భయపడుతున్నాడో మరి..! 

మరింత సమాచారం తెలుసుకోండి: