యంగ్ హీరో వరుణ్ సందేశ్ కెరీర్ అటు ఇటు కాకుండా ఉన్న విషయం తెలిసిందే. గడిచిన మూడేళ్లుగా ఛాన్సుల్లేక సతమతమవుతున్నాడు. అందాల కథానాయిక వితిక శేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఇటీవలే మళ్లీ బిగ్ బాస్-3లో భార్య భర్తలిద్దరు ఎంట్రీ ఇవ్వడంతో వరుణ్ పేరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. విన్నర్ రేసులో టాప్ -5లో ఉన్నప్పటికి చివరి నిమిషంలో ఆ ఛాన్స్ రాహుల్ కి దక్కింది. ప్రస్తుతం బిగ్ బాస్-3 తర్వాత వరుణ్ ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయట. అంతేకాదు ఇప్పటివరకూ పది స్క్రిప్ట్ లు కూడా విన్నాడని తాజా సమాచారం. 

 

అందులో ఒకటి మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అదే ముందుగా సెట్స్ కు వెళుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. అలాగే మరో కథతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు. చారిత్రకంగా పాపులారిటీ ఉన్న ఓరుగల్లు నేపథ్యంలో ఓ సినిమా చేస్తానని క్లారిటి ఇచ్చాడు. వర్షం- ఎంసీఏ లాంటి సినిమాలు వరంగల్లు (ఓరుగల్లు) బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కి మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించాయి. హైదరాబాద్ కి ధీటుగా అభివృద్ది చెందుతోన్న నగరం కూడా వరంగల్లు. చారిత్రక ఆధారాలతో ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే ఈ తరహా కథతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. కానీ ఈ విషయంలో సరైన క్లారిటి లేదు. 

 

ఇవన్నీ సరే కానీ.. వరుణ్ సందేశ్ చివరి గా 2015లో లవకుశ అనే సినిమాలో నటించాడు. అంటే గ్యాప్ ఇప్పటివరకూ నాలుగేళ్లు. అప్పట్లో మరో రెండు సినిమాలు మొదలు పెట్టాడు గానీ మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ఐడెంటీతో మరోసారి దూసుకొస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆడియన్స్ ఇప్పుడెలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకసారి హీరోగా ఓ వెలిగి ఆ తర్వాత ఫేడవుటయ్యి అయ్యి.. మళ్లీ కంబ్యాక్ అయిన హీరోలు మనకు తక్కువే. మరి వరుణ్ ఎంతవరకు సక్సస్ అవుతాడో చూడాలి. ఇక ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరుణ్ నటించే సినిమాలలో తన భార్య 'వితిక' ని హీరోయిన్ గా రికమెండ్ చేస్తున్నాడట. అంతేకాదు క్యారెక్టర్ కి సూటయితే 'పునర్నవి' ని కూడా తను హీరోగా నటించే సినిమాలకి సజష్ చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: