నయనతార తన సినీ కెరీర్ ని ఒక మలయాళ సినిమా ద్వారా ప్రారంభించింది. తన మొట్టమొదటి సినిమా ఏంటంటే 2003లో వచ్చిన 'మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రం. కానీ తాను మలయాళం సినిమాల్లో అంతగా ఎదగలేక పోయింది. దాంతో.. మలయాళ సినీ రంగాన్ని వదిలేసి...ఒక మలయాళ టీవిలో న్యూస్ రీడర్ గా పనిచేసింది. అవునండి..! మీరు పైన చూస్తున్న చిత్రం లో ఉన్నది నయనతారనే. ప్రస్తుతం ఈమె న్యూస్ రీడింగ్ చెప్పిన ఒక వీడియో.. తమిళ మలయాళ రోజువారీ వెబ్సైట్లలో చక్కర్లు కొడుతుంది.

ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ.. ఏంటి ఈ న్యూస్ రీడర్ నయనతారానా... అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజమే మరి.. అప్పటి నయనతారకి.. ఇప్పటి నయనతారకి.. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. తమాషా ఏంటంటే..ఆమె గొంతు కూడా కొంచెం విచిత్రంగానే ఉంది. వీడియోలో ‘నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను పనిచేసుకుంటూ కనిపించారు. యాంకర్‌గానూ నయన్ స్టైలిష్‌గా ఉన్నారు కానీ చాలా మంది ఆమె లుక్స్ చూసి షాకయ్యారు.


అలాగే ఒక మలయాళ టీవీలో న్యూస్ రీడర్ కం యాంకర్ గా పనిచేసిన తర్వాత......కొంతకాలానికి తమిళ సినీ రంగంలో అడుగుపెట్టి... అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది నయనతార. తన 15 సంవత్సరాల సినీ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎట్టకేలకు
....ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంది. నయనతార నటన గురించి స్పెషల్ గా చెప్పక్కరలేదు.. తాజాగా సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా కనిపించి తెలుగు ప్రజలను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎప్పుడో తన కెరీర్ మొదట్లోని న్యూస్ రీడర్ గా చేసిన వీడియో బయటకు రావడం నయనతార అభిమానులకు పెద్ద సర్ప్రైసింగ్ గిఫ్టే అనే చెప్పుకోవచ్చు. ఆమె వీడియోని చూడాలనుకునే వారు.. ట్విట్టర్ లోని సెర్చ్ బార్ లో 'అనూష' అనే పేరుని ఆంగ్లంలో టైపు చేసి ఓకే నొక్కండి.. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియోస్ కేటగిరీ పై ట్యాప్ చేయండి. మీకు నయనతార వీడియో కనిపిస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: