సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ దూకుడు చూస్తుంటే.. ఆగరు అనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు పేరు చెప్పుకొని ఆగడం లేదు. సంక్రాంతికి మరోస్టార్ బన్నీ మూవీ "అల వైకుంఠపురములో" రావడంతో  ఈ కాంపిటీషన్ హెవీగా ఉంది. దీంతో రేసులో ముందుండేందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

 

రిలీజ్ కు వారం ముందు... మహా అయితే 15రోజుల ముందు అభిమానులు తమ హీరో కటౌట్స్ పెడతారు. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో.. అందులోనూ బన్నీ లాంటి స్టార్ తో పోటీ పడాల్సి రావడంతో మహేశ్ ఫ్యాన్స్ దూకుడు చూపిిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు 50రోజుల ముందే.. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర 81అడుగుల భారీ కటౌట్ పెట్టేశారు. 


ప్రమోషన్ లో నిన్నటి వరకు అల వైకుంఠపురములో ముందంజలో ఉంది. రిలీజ్ చేసిన రెండు వీడియో సాంగ్స్ సంగీత ప్రియులకే కాకుండా అందరికీ బాగా నచ్చేసింది. ఎక్కడ విన్నా సామాజవరగమన.. రాములో రాముల సాంగ్సే వినిపించాయి. ఈ హడావుడిని తట్టుకోవడానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమదైన స్టైల్ లో భారీ కటౌట్ తో సందడి చేశారు. 

 

రిలీజ్ కు రెండు నెలల ముందే పోటీ ఇంత తీవ్రంగా ఉన్నా.. ఎవరికి వాళ్లు ప్రమోషన్ చేసుకుంటే.. ఏ గొడవా ఉండదు. ఇన్ డైరెక్ట్ గా ఒకరిమీద ఒకరు సెటైర్స్ వేసుకుంటే.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టినట్టే. మహేశ్, బన్నీ ఫ్యాన్స్ వ్యక్తిగత విమర్శలకు పోకుండా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో పోటీపడితే ఫర్వాలేదంటున్నాయి ఫిలిం వర్గాలు. మొత్తానికి మహేశ్ బాబు ఫ్యాన్స్.. తన అభిమాన హీరోపై విపరీతమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు త్వరలో రానుండటంతో ఆ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరులో అలనాటి తార విజయశాంతి కూడా నటిస్తుండటంతో ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: