డేటింగ్ అనేది బాలీవుడ్ హీరోయిన్స్ కి చాలా సింపుల్ విషయం. ఆ మాటకొస్తే బాలీవుడ్డే కాదు అన్నీ వుడ్డులో ఉన్న హీరోయిన్స్ కి ఇది చాలా కామన్. క్రేజ్ కోసం కూడా డేటింగ్ చేస్తున్నామంటూ నిరంతరం వార్తల్లో నిలవడానికి ముంబై ముద్దు గుమ్మలు తెగ ఆరాటపడుతున్నారు. కొన్ని సార్లు ఈ ప్లాన్ వర్కవుటై పాపులరైన టాప్ హీరోయిన్స్ కూడా వున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా  డేటింగ్ సంస్కృతి గతంతో పోలిస్తే మరీ ఎక్కువైంది. పాపులర్ కావడం కోసమే అన్నట్టుగా హీరో, హీరోయిన్స్ డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

 

తాజాగా ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బందా చేరింది. తీన్మార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత ఇక్కడ అంతగా సక్సస్ ని అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న కృతి తాజాగా డేటింగ్ పేరుతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.  బాలీవుడ్ కుర్ర హీరో పులకిత్ సామ్రాట్ తో కృతి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్నే బహిరంగంగా ప్రకటించి బాలీవుడ్ సెలబ్రిటీల తో పాటు అభిమానులకు షాకిచ్చింది. అయితే డేటింగ్ లో వున్నానని చెప్పినా రూమర్స్ ఆగకపోవడంతో కృతి బాగా హర్టయిందట. 

 

దీంతో మీడియాను చెడామడా ఏకేసిన కృతి డేటింగ్ విషయాన్ని ముందే చెప్పేశాం. ఇంకా దాచేందుకు ఏమీ లేనప్పుడు ఈ పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు. మాకు కాస్త ప్రైవసీ ని ఇవ్వండి. నిత్యం వార్తల్లో వుంటే మా ఇరు కుటుంబాలకు కూడా మంచిది కాదు. అందుకే మాకు కాస్త ప్రైవసీని ఇవ్వండి అంటూ సీరియస్ అయ్యింది. పులకిత్ కూడా కృతి తరహాలోనే మీడియాను కోరడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ డేటింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమా..లేక పెళ్ళి చేసుకొని సెటిలవుతారా..అన్నది ఇప్పుడప్పుడే తెలిసే విషయం కాదు. ఇక కృతి ఇన్స్టాలోను రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను దడదడలాడిస్తోంది. ఇక కృతికి ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: