నేను పెళ్ళికి రెడీ అంటోంది హాట్ అండ్ స్వీట్ బ్యూటీ తమన్నా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారో లేదో కానీ ప్రశ్న అడిగిన విలేకరినే మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసి పెట్టమంటోంది. తమన్నా ఇపుడు ముప్పయిలో పడింది. ఆమె కెరీర్ కూడా 13 ఏళ్ళు పైదాటింది. తమన్నా ఇప్పటికి అన్ని భాషలు కలుపుకుని 70 కి పైగా సినిమాలు నటించింది. అందులో గ్లామర్ కాకుండా మంచి పాత్రలు కూడా  ఉన్నాయి. బాహుబలి సైరా నరసింహారెడ్డి వంటి ప్యాన్ ఇండియా మూవీస్ లో కూడా  తమన్నా మెరిసింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి కూడా.

 

ఇదిలా ఉండగా తమన్నా సీనియర్ హీరోలతో నటించకుండా పెళ్ళి చేసుకుని వెల్ళిపోవాలనుకుంటోందట. కెరీర్ ఇదివరకంత జోరు మీద లేదు, అందువల్ల దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుని ఒక ఇంటావిడ కావాలానుకుంటోందట. ఇక తమన్నా ఇంకా గ్లామర్ పంచుతూ తన సత్తా చాటుకుంటోంది. విశాల్ సరసన నటించిన యాక్షన్ మూవీలో తమన్నా తళుకుబెళుకులు మరో మారు కుర్ర కారు గుండెలను కీచుకీచుమనిపించాయి.

 

ఇక తమన్నా ముంబైలో మంచి ఫ్లాట్ కూడా కొనుక్కుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఇల్లు రెడీ అయింది. ఇంటాయన రావాల్సివుంది. కోలీవుడ్ మీడియాతో తాజాగా  తమన్నా మాట్లాడుతూ తనకు కూడా  పెళ్ళి చేసుకోవాలని ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పింది. అయితే తాను కోరుకున్న లక్షణాలు ఉన్న అబ్బాయి అయితే ఇపుడే పెళ్ళికి రెడీ  అని గడుసుగా అంటోంది.

 

మరి ఆమె కోరుకుంటున్న ఆ వరుడు ఎలా ఉంటాడో మాత్రం సస్పెన్స్. ఇదిలా ఉండగా రాజకీయాల్లోకి రావాలని తనకు లేదని, తనకు ఆ తెలివితేటలు లేవని బోల్డ్ గా అన్సర్ ఇచ్చిన తమన్నా తమిళనాడు టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒక్కటిగా  రాజకీయాల్లోకి వస్తే వారికి సక్సెస్ ఖాయమని కూడా జోస్యం చెప్పింది. మొత్తానికి ఏమీ తెలియవంటూనే రాజకీయాల గురించి కూడా మాట్లాడిన తమన్నా ఏ క్షణంలోనైనా పెళ్ళి పీటలెక్కొచ్చు.   మిల్కీ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: