ప్రతి శాఖ లోను మనకు అనుకూలంగా, అలానే మనకు విలువనిచ్చేవారు ఎందరు ఉన్నప్పటికీ మనమంటే గిట్టని వారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మాత్రం మనలో చాలా మందికి తారసపడి ఉంటారు. ఎందుకంటే మనం చేసే పని కొందరికి నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కోలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం వచ్చిన లవ్ ఇన్ షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించిన అంజలి, కొన్నాళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ ల కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లలో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి పాపులరైంది. 

 

ఇక ఆ తరువాత వచ్చిన గీతాంజలి సినిమా, అంజలికి తెలుగులో మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అటు తమిళ్ లోనూ అంజలి పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి దూసుకుపోతోంది. కాగా నిన్న ఒక కోలీవుడ్ నిర్మాత అంజలిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, నిన్నటినుండి టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా సంచలనంగా మారింది. తాము ఇటీవల నిర్మించిన ఒక సినిమాలో హీరోయిన్ అయిన అంజలి, ఆ సినిమాలో హీరో గారితోనే ఎక్కువగా చనువుగా ఉండేదని, సినిమా సీన్స్ సమయంలోను, అలానే సెట్ లోను ఆమె ఆ హీరోగారితో ఎంతో చనువుగా ఉండేదని, అది మాత్రమే కాక వారిద్దరికీ హోటల్ లో ప్రత్యేకంగా రూమ్స్ కేటాయించగా, 

 

తాము ఎప్పుడు హీరో గారి రూమ్ కి వెళ్లి చూసినా, అది తాళం  వేసి ఉండేదని అన్నారు. వాస్తవానికి తనకు అంజలి అంటే ఎంతో ఇష్టం అని, అలానే ఆమె ఇతరలులకు ఎంతో మర్యాద ఇస్తుందని అయితే, సదరు హీరో గారి మాయలో పడి, అతడిని నమ్మి మోసపోతోందని కామెంట్స్ చేసాడు. అయితే అసలు ఆ నిర్మాత ఎందుకు సడన్ గా అంజలిని టార్గెట్ చేయడం జరిగిందనేది మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే మెయిన్ గా అతడికి సదరు హీరోగారి మీద కోపం ఉందని, ఆ విషయమై హీరోతో పాటు అంజలిని కూడా ఆ నిర్మాత టార్గెట్ చేస్తూ మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. ఇక ఈ విషయమై అంజలి ఇప్పటివరకు తన స్పందనను తెలియచేయలేదు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సైతం ఎంతో వైరల్ అవుతోంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: