కచ్చితంగా ఈ టైటిల్ చూసి ఇదేదో చంద్ర బాబు.. పవన్ కళ్యాణ్ ల గురించి అని ఊహించి ఉండొచ్చు. అలా అనుకోవడంలో తప్పేం లేదు.. కాని ఇక్కడ బాబు అంటే చంద్రబాబు కాదు. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శీను నుండి రాక్షసుడు వరకు సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటికి తగినట్టుగా హిట్ అందుకోవట్లేదు బెల్లంకొండ శ్రీనివాస్.

 

రాక్షసుడు కొద్దిగా పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. ప్రస్తుతం కథా చర్చలు జరుపుతున్న శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. అదేంటి పవన్ చేయాల్సిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ ఎలా చేస్తాడని ఆశ్చర్యపోవచ్చు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తీఅ రాజకీయాలకు పరిమితమయ్యాడు.

 

సినిమాలు చేస్తా చేస్తా అంటున్నాడు కాని దానికి సంబందించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని అన్నారు. కాని ఆ సినిమా ఎందుకో పట్టాలెక్క లేదు. సంతోష్ శ్రీనివాస్ అదే కథను రవితేజకు వినిపించాడు.. అక్కడ కూడా వర్క్ అవుట్ అవలేదు.

 

ఫైనల్ గా బెల్లంకొండ బాబు ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీ పెంచాడట. ఈ సినిమాతో పాటుగా శ్రీను వైట్ల డైరక్షన్ లో కూడా శ్రీనివాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పవర్ స్టార్ కోసం కథ రాసుకున్నా అదే కథను బెల్లంకొండ శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా స్క్రీన్ ప్లే రాశాడట. మరి ఈ సినిమాతో అయినా బెల్ల్మకొండ బాబుకి పవర్ ఫుల్ హిట్ వస్తుందేమో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: