టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ఒక మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అతి త్వరలో తెరకెక్కబోయే తన 152వ సినిమాలో నటించనున్న మెగాస్టార్, అందుకోసం అన్ని విధాలుగా తనను తాను సంసిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే శారీరకంగా ఎంతో వెయిట్ తగ్గిన మెగాస్టార్, ఆ సినిమా కోసం మరింతగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఎంత సినిమాలు చేసినప్పటికీ, తనతో కలిసి గతంలో సినిమాల్లో నటించిన వారిని ఎప్పటికపుడు తీరిక సమయాల్లో కలుసుకుని వారితో సరదాగా గడుపుతుంటారు మెగాస్టార్

 

నిన్న హైదరాబాద్ లోని తన స్వగృహంలో 1980ల కాలం నాటి పలు భాషలకు చెందిన హీరోలు, హీరోయిన్ల మీట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన 80ల కాలం నాటి పలువురు సీనియర్ నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది. ఇక మెగాస్టార్ కూడా వారితో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసిన ఫోటోలు నేటి ఉదయం ఉంది పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ పార్టీలో రామ్ చరణ్ కనపడడం కొంత ఆసక్తికరంగా మారింది. 

 

నిజానికి సీనియర్స్ కోసం కేటాయించిన ఆ పార్టీలో జూనియర్ మెగాస్టార్ ఏంచేస్తున్నాడబ్బా అంటూ పలువురు నెటిజన్లు క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, పలువురు సీనియర్ నటీనటులు మెగాస్టార్ ఇంటికి వచ్చి, పార్టీలో పాల్గొన్న తరువాత, తిరిగి తమ ఇంటికి పయనమయ్యే సమయంలో రామ్ చరణ్ ని కలవడం, దానితో పాటు ఆయనతో సరదాగా ఫోటోలకు ఫోజివ్వడం జరిగిందట. అంతేతప్ప, రామ్ చరణ్ వారి పార్టీలో పాల్గొనలేదని మెగాస్టార్ సన్నిహితులు కొందరు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారట. కాగా ఈ మ్యాటర్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: