ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే అందాలు ఉన్నా సరే వెండితెర మీద లక్ కలిసి రాని సుందరీమణులు ఎంతోమంది ఉన్నారు. వారిలో సాక్షి చౌదరి కూడా ఒకరు. మంచు మనోజ్ పోటుగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాక్షి తన అందంతో యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. అయితే మొదటి సినిమా మంచి క్రేజ్ తెచ్చినా ఆ తర్వాత సినిమా కథల విషయంలో పొరపాట్లు చేసింది. అందుకే అమ్మడు కెరియర్ లో చాలా వెనుక పడ్డది.

 

సినిమా ఛాన్సులు వచ్చినా రాకున్నా ఈమధ్య హీరోయిన్స్ అంతా తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. అందరి దారిలోనే తనూ అన్నట్టుగా సాక్షి చౌదరి కూడా హాట్ ఫోజులతో రెచ్చగొడుతుంది. అందం అభినయం ఉన్నా సరే అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి రాలేదని చెప్పాలి.

 

ఇక లేటెస్ట్ గా స్లీవ్ లెస్ డ్రెస్ తో బెడ్ రూం ఫోటో షూట్ తో ముక్కున వేలేసుకునేలా చేస్తుంది సాక్షి చౌదరి. ఈ ఫోటో షూట్ లో పైనుండి దిగిన అందాల అప్సరసలానే ఉంది సాక్షి. తనకు ఒక్క సరైన అవకాశం రావాలే కాని తన సత్తా ఏంటో చూపిస్తా అంటూ ఊరించే అందాలతో మత్తెక్కించే కళ్లతో ఇన్ డైరెక్ట్ హింట్ ఇస్తుంది. 

 

మొన్నీమధ్య మ్యాగ్నెట్, సువర్ణ సుందరి అనే రెండు సినిమాలు చేసిన సాక్షి చౌదరి అవి వచ్చింది వెళ్లింది ఎవరికి తెలియలేదు. ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం చూస్తున్న సాక్షి తన లేటేస్ట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆకర్షించే అందాలతో అమ్మడు చేస్తున్న ఈ రకరకాల ఫోటో షూట్స్ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయంటే నమ్మాల్సిందే. ప్రస్తుతం సాక్షి చౌదరి తెలుగులో ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: