సూపర్ స్టార్ రజినికాంత్ సరసన చంద్రముఖి అనే సినిమాతో తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన మలయాళ నటి నయనతార, అంతకముందు మూడు మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. అయితే తమిళంలో తొలి సినిమానే సూపర్ స్టార్ సరసన ఆమెకు అవకాశం రావడం, అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తమిళ చిత్ర పరిశ్రమ చూపు ఆమె మీద పడింది. ఇక అక్కడినుండి వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగిన నయనతార, తమిళ్ తో పాటు తెలుగులో కూడా పలువురు అగ్ర నటుల సరసన నటించి మంచి విజయాలు సొంతం చేసుకుంది. 

 

ఇకపోతే ప్రస్తుతం సౌత్ లో మంచి పేరున్న స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతారకు సంబంధించి కొన్నేళ్ల క్రితం చిత్రీకరించిన వీడియో ఒకటి నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే, కొన్నేళ్ల క్రితం ఆమె పూర్తిగా సినిమా రంగ ప్రవేశం చేయక ముందు, ఒక మలయాళ ఛానల్ లో యాంకర్ గా పనిచేయడం జరిగిందట. ఆ సమయంలో కైరళి టీవీలో చమయం అనే ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరించిన నయనతార తాలూకు వీడియో క్లిప్పింగ్స్ ని కొందరు ఇంటర్నెట్ లో నేడు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ క్లిప్పింగ్స్ చూసిన పలువురు సినిమా ప్రేక్షకులు, అసలు ఈమె నయనతారేనా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక ఆ వీడియోలో నిజంగా నయనతార ఎంతో సన్నగా, చాలా చిన్న అమ్మాయిల కనపడుతోంది. కాగా, కాలం మారడంతో ఆమె ముఖంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసిన పలువురు నయనతార ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారట. తమ హీరోయిన్ ఎప్పటికీ అందగత్తె అని, ఆమె భవిషత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: