అందాల తార, దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార 16 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. 2003లో 'మనస్సినక్కరే' అనే మలయాళం చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన నయనతార అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంత చేసుకుంది.   

 

ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతూ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార రికార్డు సృష్టించింది. తాజాగా సైరా నరసింహ రెడ్డి, విజిల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 

 

అయితే ఎంతో అందమైన నయనతారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ అంత వైరల్ గా మరీనా వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి నయనతార హీరోయిన్ అవ్వకముందు ఓ మళయాళం ఛానెల్ లో యాంకర్ గా పనిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

ఆ వీడియోని చూస్తే ఇక్కడ నయనతార కాదు మరెవరో అని అనుకుంటారు.. ఆలా ఉంది. అసలు ఆ వీడియోని చూస్తే కొంచం కూడా గుర్తుపట్టలేరు.. చెప్పాలంటే ఆ వీడియోని నయనతార చుసిన సరేగుర్తుపట్టలేదు. అంత గుర్తు పట్టలేని విధంగా నయనతార ఆ వీడియోలో ఉంది. 

 

అంతే కాదు ఆ వీడియోలో నయనతార వాయిస్ కూడా చాల విచిత్రంగా ఉంది. ఆ వీడియోలో 'నా పేరు డయానా మరియం కురియన్' అంటూ తన గురించి తాను చెప్తూ నయనతారకనిపించింది. అయితే ఒక చిన్న టీవీ ఛానెల్ లో యాంకర్ గా అడుగుపెట్టిన నయనతార ప్రస్తుతం ఒక లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విజయం అంటే ఇదే కదా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: