అర్జున్ రెడ్డి..తెలుగులో ఈ సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీసున్ను షేక్ చేసిన సినిమా ఇది. కొత్త దర్శకుడు చేసిన ఈ సినిమా టాలీవుడు సినిమానే కొత్త దారిలోకి తీసుకువెళ్ళింది. అప్పటి వరకు ఏ దర్శకుడు చేయనటువంటి సాహసం చేసిన సందీప్ రెడ్డి వంగాకి ఎంతో మంది నుండి ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా హిందీలో షాహిద్ కపూరు హీరోగా "కబీర్ సింగ్" గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 

కబీర్ సింగ్ కి కూడా సందీప వంగానే దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ లో సినిమా ముడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి షాహిద్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం తమిళంలో కూడా రీమెక్ అయింది. ఆదిత్య వర్మ పేరుతో సందీప్ రెడ్డి వంగా మొదటి సహాయ దర్శకుడైన గిరిశాయ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కింది.

 

ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి తమిళంలో కూడా చక్కటి ఆదరణ అందుకుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ చాలా సంతోషంగా ఉన్నాడు. తన కొడుకు ఆదిత్య వర్మ లాంటి కథ  ద్వారా లాంచ్ అవడం తనకి చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. అంతే కాదు,  తన కొడుకు నటనను ఎంతో మెచ్చుకున్న విక్రమ్ ఈ చిత్ర కథకు కారకుడైన సందీప్ రెడ్డి వంగాను పొగడ్తలతో ముంచివేశారు. ఆయన రాసిన కథకు తన కొడుకు ధృవ్ ని అన్వయించుకొని చూశాను అన్నారు. ఇలాంటి అద్భుతమైన కథను అందించిన ఆయనకు కృతజ్ఞలు తెలిపారు. 

 

హిందీలో కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగులో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలీవుడ్ లోనే తీయాలని అనుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: