సాధారణంగా చాలా మంది హీరో, హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో ఒకరకంగా ఉంటారు..మంచి హిట్ పొజీషన్లోకి వచ్చిన తర్వాత వారి రూపు రేఖలు పూర్తిగా మారుతుంటాయి.  అయితే కొంత మంది హీరో, హీరోయిన్లు మంచి ముఖారవిందం కోసం ప్లాస్టీక్ సర్జరీ కూడా చేసుకుంటారు..దాంతో గతంలో ఉన్న వారి పోలికలకు అస్సలు మ్యాచ్ అవదు. తాజాగా ఇప్పుడు ఇలాంటిదే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  దక్షిణాదిన నెంబర్ వన్ పొజీషన్లో ఉంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి నయనతారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోతెగ హల్ చల్ చేస్తుంది.

 

 లేడీ సూపర్ స్టార్ గా నయన్ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.   ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా నయన్ తో మాత్రం పోటీ పడలేకున్నారు.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో అగ్రహీరోలందరి సరసన నటించింది నయనతార.  నయనతార రీసెంట్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. నయనతార అందరి హీరోయిన్లలా కాదు. సినిమాలో నటించడం వరకే చేస్తుంది. ప్రచార కార్యక్రమాలకు నయన్ దూరంగా ఉంటుంది. అయినా కూడా దర్శక నిర్మాతలు నయన్ డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. 

 

అయితే నయనతారకు ఇంత గొప్ప అవకాశాలు..ప్రశంసలు ఒక్క నైట్ లోనే రాలేదు. ఇండస్ట్రీలో వారసత్వంగా కూడా రాలేదు.  మొదట మోడలింగ్ చేసి..తర్వాత ఓ మలయాళీ టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. నయనతార యాంకరింగ్ చేస్తున్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో నయన్ ని చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలో నయన్ అస్సలు గుర్తుపట్టరాకుండా ఉంది.  

 

అసలు ఈ వీడియోలో ఉన్నది నయనతారేనా అంటూ కొందరు అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో నయనతార తన అసలైన పేరు రివీల్ చేసింది.  ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘దర్భార్’ మూవీలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: