టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఏర్పరచడం జరిగింది. అతి త్వరలో టీజర్ కూడా రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్, సుశాంత్ అక్కినేని, నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా విషయమై నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కి సంబందించిన ఒక సెంటిమెంట్ ని బట్టి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అంటున్నారు కొందరు. గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ తీసిన మొదటి రెండు సినిమాలు మంచి హిట్ కాగా, మూడవ సినిమా అయిన అజ్ఞాతవాసి టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఘోరమైన అనుభవాన్ని త్రివిక్రమ్ ఎదుర్కొన్నారు. ఇకపోతే ఇటీవల అల్లుఅర్జున్ తో ఆయన తీసిన గత రెండు సినిమాలైన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. 

 

ఇక ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మూడవ సినిమా అయిన అలవైకుంఠపురములో కూడా పవన్ అజ్ఞాతవాసి మాదిరిగా అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అని లోలోపల భయపడుతున్నారట. అదీకాక జనవరిలో సరిగ్గా సంక్రాంతి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా వస్తుండడంతో, ఏ మాత్రం ట్రాక్ తేడా వచ్చిన కలెక్షన్స్ మొత్తం సూపర్ స్టార్ సినిమాకు వెళ్లిపోవడం ఖాయం అని కొంత ఆలోచిస్తున్నారట. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని, సినిమాలో విషయం ఉంటె ఇటువంటివి పట్టించుకోవలసిన అవసరం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: