ఈ సోషల్ మీడియా కాలంలో ఒక్కరోజులోనే ఒకరి జీవితం ఎంతగా మారిపోతుందో చెప్పలేం. నిన్నటి వరకు ఎవరికీ తెలియని వారు.. ఒక్కరోజులోనే ఎంతోమంది ఫాలో అయ్యే సెలబ్రిటీగా మారిపోతున్నారు. అప్పటిదాకా ఆమె ఎవరో తెలియదు ఒక్కసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ అంటే.. ఆ రేంజి ఎలా ఉంటుందో ట్విట్టర్ ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది.    

 

ఎక్కడో లండన్ లో థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా మోరిస్ ప్రస్తుతం సెవెన్ ట్రైల్స్ సెవెన్ డేస్ అనే సీరియల్లో నటిస్తుంది. అంతకుముందు సినిమాలో నటించిన అనుభవం లేకపోయినా సరే డైరెక్ట్ గా ఆర్.ఆర్.ఆర్ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుంది.  మన జక్కన్న కళ్ళు.. ఆమెపై పడటం ఏంటో.. ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీమ్ పాత్రకి ప్రియురాలిగా ఆమెని సెలెక్ట్ చేయడం ఏంటో.. ఆమె పేరుని అలా ప్రకటించారో లేదో మన తెలుగు సినీ అభిమానులు గూగుల్ పై దండయాత్ర చేయడం ఇదంతా ఓ మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఒక్కరోజులోనే రెండు లక్షలకు పైగా ఆమె గురించి వెతకారంటే ఇటు ఎన్టీఆర్ కి.. అటు రాజమౌళికి.. త్రిబుల్ ఆర్ సినిమాకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  

                      

అంతేకాదు ట్విట్టర్లో అంతకుముందు ఆమెకు కేవలం 389 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు. ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకి 20 వేలకి పైగా ఫాలోవర్స్ ని ఒక్కరోజులోనే సంపాదించుకుంది. ఈ ఆనందాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుని తెగ సంబరపడుతోంది ఒలివియా మోరిస్.. ఎన్టీఆర్ పక్కన ఆమె బొమ్మలను ఎడిట్ చేస్తూ మనవాళ్లు వారి క్రియేటివిటీని చూపిస్తూ ఎన్నో ఫోటోలను ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సినిమా చేయకముందే ఇలా ఉంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత అమ్మడి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: