రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ భాగం తాగి డ్రైవ్ చేయడం వల్లనే అవుతున్నాయి. తాగి రోడ్డు మీదకి వచ్చి వారు ఇబ్బంది పడటమే కాదు, అవతలి వారిని కూడా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలా తాగి రోడ్డు మీదకి రావడం సామాన్యులకే కాదు సినిమా వాళ్ళకి కూడా ఒక అలవాతుగా మారిపోయింది. సెలెబ్రిటీలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ విషయంలో మాత్రం ఎపుడో ఒక సమయంలో దొరికిపోతున్నారు.

 

అయితే సామాన్యులు తాగి పట్టుబడ్డ పెద్ద వార్త అవదు. కానీ సినిమా స్టార్ తాగి పట్టుబడితే మాత్రం అది పెద్ద వార్తే. నలుగురి ఎలా ఉండాలో చెప్పే వారే, అలా ఉండకపోతే అది వార్త కాకపోతే మరేమవుతుంది. చాలా రోజుల క్రితం ప్రముఖ యాంకర్ ఇలా తాగి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో యువ నటుడు తాగి డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.

 

నీకు నాకు డాష్ డాష్ , బస్ స్టాప్, రొమాన్స్, వేర్ ఈజ్ విద్యాబాలన్  వంటి చిత్రాలలో హీరోగా నటించిన ప్రిన్స్ ఈ వ్యవహారంలో పోలీసులకి చిక్కాడు. ఈనెల 24 ఆదివారం హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో గల విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డారు. ఆసమయంలో తాగి కార్ డ్రైవింగ్ చేస్తున్న ప్రిన్స్ పై పోలీసులు కేసునమోదు చేశారు. ఆ కేసు నేడు విచారణకు రావంతో ఆయన కూకట్ పల్లి కోర్ట్ కి హాజరయ్యారు.

 

డ్రంక్ అండ్ డ్రైవ్ నేరానికి గాను జడ్జ్ ప్రిన్స్ కి జరిమానా విధించడంతో పాటు గట్టిగా మందలించారని సమాచారం.ఈ విషయంలో సెలెబ్రిటీలని మరింత గట్టిగా మందలించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారట. అందుకే సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పటికైనా సెలెబ్రిటీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: