సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. రజనీ సినిమాలు కొనడానికి తెలుగు బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదట. రజనీ కాంత్ గత సినిమాలన్నీ తెలుగులో దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రోబో ౨ తెలుగులో మంచి రేటుకి అమ్ముడైనా కానీ లాభాలు రాలేదు. శంకర్ సినిమా అని తెలిసినా కూడా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రోబోనే కాదు కబాలి, కాలా, పేట మొదలగు చిత్రాలన్నీ బయ్యర్లకి నష్టాలనే మిగిల్చాయి.

 


ఆ ప్రభావం ఇప్పుడు దర్బార్ చిత్రం మీద బాగా పడింది. దర్బార్ చిత్రం కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదట. ఈ చిత్రాన్ని కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ఆసక్తిని చూపించడం లేదట. గడిచిన ఇన్నేళ్ల లో రజనీ సినిమాకి అంతో ఇంతో మార్కెట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదన్న మాట అభిమనులకు ఆవేదన కలిగిస్తోంది. దర్శకుడు  మురుగదాస్‌ అయినా కానీ ఈ చిత్రం పట్ల తెలుగు బయ్యర్లకి ఆసక్తి లేదు. 

 

ముఖ్యంగా దీంతో పాటు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రిలీజ్‌ అవుతున్నాయి కనుక దీనిని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోరనేది బయ్యర్ల ఫీలింగ్‌. అందుకే ఈ చిత్రాన్ని అసలు లెక్క చేయడం లేదు. తెలుగులో రెండు రోజులైనా పోటీ లేకుండా వుంటుందని దర్బార్‌ రిలీజ్‌ డేట్‌ని జనవరి 9కి మార్చారు. అయినా కూడా ఈ చిత్రాన్ని కొనడానికి సాహసించట్లేదట. ఈ సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం వల్ల దర్బార్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది.

 

రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం వల్ల రజనీ సినిమాని చూడడానికి జనం రారేమోనని అనుమానంతో దర్బార్ సినిమాని తీసుకోవడానికి భయపడుతున్నారట. మరి ఎవరూ ముందుకు రాకపోతే వారే డైరెక్ట్ గా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరికి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: