క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేస్తున్న అంశం. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇప్పటికే తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి స్టార్ హీరోయిన్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అటు టాలీవుడ్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ తెరమీదికి తెచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది నటి శ్రీరెడ్డి. అయితే కాస్టింగ్ కౌచ్ మన దేశంలో కంటే పక్క దేశాల్లో ఇంకా  ఎక్కువగా ఉంది. పక్క దేశాల్లో  ఏకంగా హీరోయిన్ లను నగ్నంగా ఆడిషన్స్ చేస్తారు దర్శకులు. లేకపోతే వెళ్ళిపో అని  తెగేసి చెప్పేస్తారట.  ఇక చేసేదేమీ లేదు డైరెక్టర్లు చెప్పినట్టు చేస్తూ హీరోయిన్లు  ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక్కడ ఓ  హీరోయిన్ కు  ఇలాంటి ఘటనే ఎదురైంది . హీరోయిన్ ను నగ్నం గా మారిపోయి నటించాలని  డైరెక్టర్ చెప్పేసాడు. ప్రముఖ హాలీవుడ్ నటి ఎమిలియా క్లార్క్ l తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి సంచలన నిజాలు బయటపెట్టింది . 

 


 అమెరికన్ సెన్సేషనల్ టెలివిజన్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నటించింది ఎమీలియా క్లార్క్. ఈ సిరీస్ లో షూటింగ్ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ లో తన చేత అవసరం లేని దగ్గర కూడా అనవసరంగా బట్టలు విప్పించి షూటింగ్ చేసారని  వాపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిరీస్లో తనకు అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ ఎన్నో సన్నివేశాల్లో  అవసరం లేకపోయినా నగ్న సన్నివేశాల్లో నటించేల  చేసినందుకు మాత్రం ఎంతో బాధగా ఉందని ఆమె తెలిపింది. అయితే ఈ సిరీస్ షూటింగ్ సమయంలో అవసరం లేకపోయినా దర్శకుడు కావాలని చాలా సార్లు నగ్నంగా మారిపోవాలంటు  పోర్స్ చేశారని తెలిసింది. ఈ విషయంలో దర్శకునితో ఎన్నోసార్లు సెట్లోనే గొడవ  కూడా అయిందని తెలిపింది. 

 


గొడవ పడినప్పటికీ నగ్నంగా నటించమని ఫోర్స్ చేసేవాడని తెలిపింది. నువ్వు ఎక్కువగా నగ్న సన్నివేశాల్లో  నటించకపోతే ప్రేక్షకులు చాలా బాధ పడతారని డైరెక్టర్ చెప్పేవాడని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవసరం లేని చోట కూడా నగ్న  సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎమీలియా. అయితే ఈ అమ్మడు నటించిన సన్నివేశాల్లో  అసలు బట్టలు తీసెయ్యాల్సిన  అవసరం లేకున్నప్పటికీ కూడా... దర్శకుడు మాత్రం ఎందుకు అలా చేయించారో  అని తనకు ఇప్పటికీ అర్థం కాలేదని ఈ అమ్మడు చెబుతోంది. అయితే అప్పటివరకు తాను నగ్న సన్నివేశాల్లో నటించలేదు కాబట్టి..  ఎలాంటి ఇబ్బంది పడలేదని... కానీ మొదటి సారి నగ్న సన్నివేశాల్లో నటించటం తో చాలా ఇబ్బంది పడ్డాను అని ఎమీలియా క్లార్క్ చెప్పుకొచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: