బుల్లితెర రాములమ్మ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్..శ్రీముఖి. బుల్లితెర మీద ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ షో ద్వారా ఆమె చాలా మంది అభిమానులని సంపాదించుకోగలిగింది. అయితే బిగ్ బాస్ 3 లో అవకాశం రావడం వల్ల పటాస్ షో  స్వస్తి చెప్పి బిగ్ బాస్ కి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ 3 లో తనదైన గేమ్ తో ఫైనల్ వరకు చేరి టైటిల్ పోరులో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి రన్నరప్ గా నిలిచింది.

 

అయితే బిగ్ బాస్ ద్వారా శ్రీముఖి పాపులారిటీ మరింత పెరిగింది.  యాంకర్ గానే కాకుండా అపుడపుడు సినిమాల్లో అడపా దడపా పాత్రల్లో కనిపించిన శ్రీముఖి ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీముఖి లీడ్ రోల్ లో నటించనుంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన వివరాలేమీ తెలియదు. కానీ మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా గురించి బయటకి వస్తుందని సమాచారం.

 

ఆ విషయం అటుంచితే శ్రీముఖిలో మరో కొత్త కోణం బయటపడింది. యాంకర్ గానే కాకుండా తన నటనతోనూ మెప్పించే శ్రీముఖి తన గొంతుతో సైతం ప్రేక్షకులని పలకరించడానికి వస్తుంది. శ్రీముఖిలో ఉన్న టాలెంట్ ని స్టార్ మా బయటపెట్టింది. స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్ అనే ఓ కార్యక్రమం కొరకు ఆమెతో ఓ సాంగ్ పాడించారు వారు. పాట పాడటమే కాకుండా ఆ పాటకు ఎనర్జిటిక్ స్టెప్స్ కూడా వేసింది శ్రీముఖి. 

 

బిగ్ బాస్ 3 లో రన్నరప్ గా నిలిచినప్పటికీ రెమ్యునరేషన్ పరంగా శ్రీముఖికి బాగానే ముట్టజెప్పారట. ఆమెకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కన్నా చాలా ఎక్కువ వచ్చినట్టు సమాచారం.  బిగ్ బాస్ పాపులారిటీని శ్రీముఖి ఏ విధంగా ఉపయోగించుకుంటుందో ముందు ముందు చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: