75 సంవత్సరాల వయసు వచ్చినా రచయిత విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళిని మించిన స్పీడ్ ను ప్రదర్శిస్తున్నాడు. ‘బాహుబలి’ తో వచ్చిన ఇమేజ్ తో అనేకమంది బాలీవుడ్ దర్శకులు విజయేంద్ర ప్రసాద్ ను కలుస్తూ తమకు సరిపోయే కథ ఏదైనా ఈ సంచలన రచయిత దగ్గర ఉందా అన్న విషయమై చర్చలు చేస్తూ ఆయనకు కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేస్తున్నారు అంటే ఈ రచయిత క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. 

‘మణికర్ణిక’ మూవీకి స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ అంటే కంగనా రనౌత్ కు అపారమైన గౌరవం. టాప్ హీరోలను ఒక ఆట ఆడించే కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సక్సస్ మీట్ లో విజయేంద్ర ప్రసాద్ కు పాదనమస్కారం చేసి ఆమె అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు విజయేంద్ర ప్రసాద్ వ్రాసిన ఒక వివాదాస్పద కథకు కంగనా ఓకె చెప్పినట్లు సమాచారం. అయోధ్యలో రామ మందిరానికి సంబంధించిన కేసులో ఇటీవ‌లే సుప్రీం కోర్టు వెలువ‌రించిన తీర్పు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే దీని నేప‌థ్యంలో ఓ స్క్రిప్టు రాస్తున్నార‌ట విజ‌యేంద్ర‌ ప్రసాద్. 

దానికి ‘అప‌రాజిత ఆఫ్ అయోధ్య’ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశార‌ని వార్తలు వినిపిస్తున్నా. అయోధ్య నేప‌థ్యంలో నాస్తికురాలిగా ఉన్న ఒక అమ్మాయి ప‌ర‌మ భ‌క్తురాలిగా మారే క‌థ‌తో ఈ సినిమాను తీయబోతున్నారు. వాస్తవానికి ఇలాంటి వివాదాస్పదమైన కథలో నటించినప్పుడు అనేక సమస్యలు వస్తాయి. అయితే అలాంటి విషయాలను లెక్క చేయకుండా వివాదాలు వస్తేనే తన సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న అంచనాలతో కంగనా రనౌత్ ఈ స్క్ర్పిట్ కు ఓకె చెప్పినట్లు వార్తలు వ్రాస్తోంది. అయితే ఇలాంటి వివాదాస్పద సినిమాలకు అనేక అవాంతరాలు వచ్చే ఆస్కారం ఉంది. వాటన్నింటిని దాటుకుని ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ బాలీవుడ్ మీడియా సందేహాలను రేపుతోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: